Sunday, January 18, 2026
Homeబిజినెస్High Life Jewelers: హై లైఫ్‌ జ్యువెలర్స్‌ ఇయర్‌ ఎండ్ ఎగ్జిబిషన్‌.. కనువిందు చేయనున్న వెరైటీ...

High Life Jewelers: హై లైఫ్‌ జ్యువెలర్స్‌ ఇయర్‌ ఎండ్ ఎగ్జిబిషన్‌.. కనువిందు చేయనున్న వెరైటీ కలెక్షన్లు

High Life Jewelers Year End Exhibition: 2025 ఏడాది ముగింపునుకు చేరుకున్నాం. మరికొద్ది రోజుల్లో నూతన ఏడాది 2026లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంగా అనేక సంస్థలు ఇయర్‌ఎండ్‌ సేల్‌ నిర్వహిస్తూ యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పాపులర్‌ జ్యువెలరీ సంస్థ హై లైఫ్ జ్యువెలర్స్‌ హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు ఇయర్‌ ఎండ్‌ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తోంది. ఈ ఎగ్జిబిషన్‌లో అనేక వెరైటీ బంగారు ఆభరణాలను అందుబాటులోకి తీసుకురానుంది.

- Advertisement -

అన్ని వెరైటీ కలెకన్లు ఒకే వేదికపై..

అన్ని వేడుకకు సరిపోయే విధంగా చక్కటి ఆభరణాలు, హెరిటేజ్ పోల్కీ, చేతితో తయారు చేసిన బంగారు ముక్కలు, వజ్రాల ఆభరణాలు, ఫ్యూజన్ డిజైన్‌లు, స్టేట్‌మెంట్ సెట్లు ఇలా అద్భుతమైన కలెక్షన్లను ఒకే వేదికపైకి తీసుకురానుంది. ఈ ఎగ్జిబిషన్‌లో భాగంగా క్లాసిక్‌ కలెక్షన్ల నుండి ఆధునిక డిజైన్ల వరకు, ప్రతి ఒక్క నూతన కలెక్షన్‌ను ఒకే వేదికపై చూడవచ్చు.

మూడ్రోజుల పాటు హెచ్ఐసీసీ వేదికగా..

డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లోని నోవోటెల్ హెచ్‌ఐసీసీలో ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నట్లు హై లైఫ్‌ జ్యువెలర్స్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. వెరైటీ కలెక్షన్లను కొనుగోలు చేయాలనుకునే వారు ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించాలని సంస్థ ప్రతినిధులు కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News