Homeబిజినెస్Honda City facelift: హోండా నుంచి మరో బడ్జెట్‌ కారు.. ఫీచర్లు చూస్తే వావ్‌ అనాల్సిందే...

Honda City facelift: హోండా నుంచి మరో బడ్జెట్‌ కారు.. ఫీచర్లు చూస్తే వావ్‌ అనాల్సిందే గురూ..!

Honda City facelift launched: బడ్జెట్‌ ధరలో కొత్త కారు కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌. ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ హోండా కార్స్‌ ఇండియా తన పాపులర్‌ హైబ్రిడ్‌ సెడాన్‌ హోండా సిటీ 2026ని భారత మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. రూ. 11.99 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధర వద్ద దీన్ని లాంచ్‌ చేసింది. మిడ్‌సైజ్‌ సెగ్మెంట్‌లో ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌, స్కోడా స్లావియా, హ్యుందాయ్‌ వెర్నాకు ఈ మోడల్‌ గట్టి పోటీ ఇవ్వనుంది. హోండా సిటీతో పాటు జడ్‌ఆర్‌-వి ఎస్‌యూవీని సైతం కంపెనీ ఆవిష్కరించింది. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌ ఫీచర్ల విషయానికి వస్తే.. పాత్‌ హోండా సిటీ వేరియంట్‌లో అనేక మార్పులు చేసింది. దీని ముందు భాగాన్ని పూర్తిగా మార్చేసింది. హనీకూంబ్‌ తరహాలో ఫ్రంట్‌ గ్రిల్‌, లైట్‌తో కూడడిన స్ట్రిప్‌ను అందించింది. ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లేతో కూడిన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోఐన్‌మెంట్‌ సిస్టమ్‌ను అమర్చింది. సన్‌రూఫ్‌, వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌, ఫ్రంట్‌ వెంటిలేటెడ్‌, 8 స్పీకర్‌ సిస్టమ్‌, యాంబియెంట్‌ లైటింగ్‌, ఫుట్‌వీల్‌ లైటింగ్‌ వంటి అత్యాధునిక సదుపాయాలు అందించింది. 360 డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌ బ్యాగులు, హిల్‌హోల్డ్‌ అసిస్ట్‌, ఏడీఏఎస్‌ ఫీచర్లను సైతం చేర్చింది. ఈ కారు 1.5 లీటర్‌ నాచురల్‌ యాస్పిరేటెడ్‌ ఇంజిన్‌ 121 హెచ్‌పీ పవర్‌ను, 145 ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్‌ స్పీడ్‌ మాన్యువల్‌ లేదా సీవీటీ గేర్‌ బాక్స్‌ను అమర్చింది.

- Advertisement -

Also read: Donald Trump: ఆ పెళ్లికి వెళ్తే నన్ను చంపేస్తారు.. డొనాల్డ్ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

2030 నాటికి 10 కొత్త మోడళ్లు..

భారత మార్కెట్‌లోకి 2030 నాటికి ఎలక్ట్రిక్‌, కాంపాక్ట్‌ ఎస్‌యూవీ సహా 10 కొత్త మోడళ్లను లాంచ్‌ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని హోండా ఇండియా వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి ఎలక్ట్రిక్‌ కారును లాంచ్‌ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News