Sunday, February 8, 2026
Homeబిజినెస్Honda Shine 125: ప్రీమియం లుక్‌తో మార్కెట్లోకి హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్..

Honda Shine 125: ప్రీమియం లుక్‌తో మార్కెట్లోకి హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్..

Honda Shine 125 Limited Edition Launched: హోండా మోటార్ సైకిల్ & స్కూటర్ ఇండియా దాని ప్రసిద్ధ కమ్యూటర్ మోటార్ సైకిల్ షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ ప్రత్యేక ఎడిషన్‌ను సైలెంట్ గా లాంచ్ చేసింది. స్టైలింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ, షైన్ లైనప్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడమే ఈ ఎడిషన్ లక్ష్యం. కంపెనీ దీనిని కొత్త గ్రాఫిక్స్, ప్రత్యేక రంగు ఎంపికలు, మెరుగైన విజువల్ అప్‌డేట్స్‌తో యువతను ఆకట్టుకునేలా రూపొందించింది. కాగా, ఈ బైక్ త్వరలో భారత ఆటో మార్కెట్లో విక్రయానికి రానుంది. ఇప్పుడు ఈ బైక్ కి సంబంధించి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

- Advertisement -

 

హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్

హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ అతిపెద్ద హైలైట్ దాని కొత్త డిజైన్, రంగు ఎంపిక. కంపెనీ ఈ బైక్ ను కొత్త పెర్ల్ సైరెన్ బ్లూ రంగులో అందిస్తోంది. ఇది ప్రీమియం ఫీల్‌ను అందిస్తుంది. ఇందులో డార్క్ బ్లూ బాడీ ప్యానెల్స్ బైక్‌కు స్పోర్టీ లుక్‌ను ఇస్తుండగా, ఫ్యూయల్ ట్యాంక్‌పై ఉన్న ప్రత్యేక షైన్ గ్రాఫిక్స్ దాని ప్రత్యేకతను మరింత పెంచుతున్నాయి. ఫ్రంట్ విజర్, సైడ్ కవర్, రియర్ కౌల్‌లపై కొత్త డిజైన్ ఎలిమెంట్స్ స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా బ్రౌన్ ఫినిష్‌లో అందించిన అలాయ్ వీల్స్ ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను సాధారణ షైన్ 125 డిస్క్ వేరియంట్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నంగా నిలబెడతాయి. మొత్తం మీద ఈ కొత్త ఎడిషన్ స్టైలింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చే కస్టమర్లను ఆకట్టుకునేలా రూపొందించబడింది.

ALSO READ:Lemon Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగితే..ఈ అద్భుతమైన 5 ఆరోగ్య లాభాలు మీ సొంతం..

హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ ఇంజిన్

ఇంజిన్ పరంగా..లిమిటెడ్ ఎడిషన్ హోండా షైన్ షైన్ 125 డిస్క్ మాదిరిగానే సెటప్‌ను కలిగి ఉంది. ఇది 123.94 cc, BS6-కంప్లైంట్, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7,500 rpm వద్ద 10.6 హార్స్‌పవర్, 6,000 rpm వద్ద 11 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు.

హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ కొలతలు

ఈ మోటార్‌సైకిల్ కర్బ్ వెయిట్ కేవలం 113 కిలోలు. దీంతో ఈ బైక్ ను తేలికగా హ్యాండిల్ చేయవచ్చు. దీని సీట్ హైట్ 791 mm. ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో ఉన్న 10.5 లీటర్ల ఇంధన ట్యాంక్ దీర్ఘ ప్రయాణాలకూ సరిపడా రేంజ్‌ను అందిస్తుంది. కొలతల పరంగా..షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ పొడవు 2,046 mm, 741 mm వెడల్పు, 1,116 mm ఎత్తుతో సమతుల్యమైన డిజైన్‌ను కలిగి ఉంది.అలాగే 1,285 mm వీల్‌బేస్ మంచి స్థిరత్వాన్ని ఇస్తుండగా 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ భారతీయ రోడ్లపై ఎదురయ్యే స్పీడ్ బ్రేకర్లు, గుంతలను సులభంగా దాటేందుకు సహాయపడుతుంది. సస్పెన్షన్ వ్యవస్థగా ముందుభాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు అందించారు. ఇవి పట్టణ రోడ్లపై సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి.

హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ ధర

హోండా అధికారికంగా ఈ బైక్ ధరను ప్రకటించనప్పటికీ షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ ధర ప్రామాణిక షైన్ 125 డిస్క్ (ఎక్స్-షోరూమ్ ధర రూ. 85,211) కంటే దాదాపు రూ.1,500 ఎక్కువగా ధర ఉండే అవకాశం ఉంది.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News