Job Changing Risk Loans:ఉద్యోగ మార్పులు చాలా మందికి సాధారణం. మంచి జీతం, కెరీయర్ గ్లోత్ లేదా అనుకూలమైన వాతావరణం కోసం చాలా మంది ఉద్యోగాలను మార్చుతుంటారు. అయితే ఇలాంటి మార్పులు పర్సనల్ లోన్ పొందటంలో ప్రతికూల ప్రభావం కలిగిస్తాయని ఖచ్చితంగా ఉద్యోగులు తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
జాబ్ స్టెబిలిటీతోనే రుణం..
బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రుణాన్ని అందించే సమయంలో కేవలం ఆదాయం మాత్రమే కాకుండా.. అప్లికెంట్ ఆదాయం స్థిరంగా కొనసాగుతుందా అనే అంశాన్ని కూడా చూస్తారు. ఇక్కడే జాబ్ స్టెబిలిటీపై కన్నేస్తారు. ఒకే ఉద్యోగంలో కనీసం 6–12 నెలలపాటు ఒక సంస్థలో కొనసాగితే బ్యాంకులకు ఆర్థికపరమైన స్థిరత్వం ఉందని అనిపిస్తుంది. కానీ తరచు ఉద్యోగాలు మార్చడం లేదా కొత్త ఉద్యోగంలో ప్రొబేషన్‌లో ఉన్న వంటి సందర్భాల్లో లోన్ అప్రూవల్ కష్టతరం కావచ్చు.
కొత్త ఉద్యోగంలో చేరగానే లోన్ కష్టమే..
ఉద్యోగం మార్చిన వెంటనే లోన్ కోసం దరఖాస్తు చేస్తే.. చాలా బ్యాంకులు అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే, కొత్త ఉద్యోగంలో జీతం నిరంతరంగా రావడం, ఉద్యోగం స్థిరపడడం కొంత సమయం పడుతుంది. ప్రొబేషన్ పీరియడ్ పూర్తికాక ముందే రుణం కోరితే.. ఎక్కువగా రిజెక్షన్ వస్తుందని గుర్తుంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఆమోదించినా చిన్న మొత్తం రుణాలను మాత్రమే బ్యాంక్స్ ఇస్తుంటాయి. మరికొన్నిసార్లు ఎక్కువ వడ్డీ రేటుకు లోన్స్ ఇస్తుంటాయి.
ఉద్యోగ మార్పు ఎప్పుడు ప్లస్ అవుతుంది?
అన్ని జాబ్ మార్పులు ప్రతికూలం కావు. కొత్త ఉద్యోగంలో జీతం భారీగా పెరిగితే అది మీరు వేగంగా లోన్ పొందటానికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఉదాహరణకు.. ఒకరు IT సంస్థలో చిన్న స్థాయి ఉద్యోగం వదిలి పెద్ద MNCలో ఎక్కువ ప్యాకేజ్ సంపాదిస్తే.. రీపేమెంట్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి ఈజీగా లోన్ పొందొచ్చు. ఇది బ్యాంకులకు నమ్మకం కలిగిస్తుంది. ఇంకా అదే రంగంలో మంచి కెరీయర్ అడ్వాన్స్‌మెంట్ కోసం మార్పు చేసినప్పుడు, సరైన డాక్యుమెంటేషన్‌తో లోన్స్ పొందటం చాలా ఈజీ అవుతుంది.
బ్యాంకులు అడిగే డాక్యుమెంట్లు..
ఉద్యోగ మార్పు తర్వాత లోన్స్ కోసం దరఖాస్తు చేస్తే.. బ్యాంకులు కొత్త సంస్థలోని ఆఫర్ లెటర్, శాలరీ స్లిప్స్, మూడు నుంచి ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్స్, పాత ఉద్యోగానికి సంబంధించిన వివరాలు అడుగుతాయి. ఈ సమాచారం పూర్తిగా అందిస్తే లోన్ ఆమోదం సులభంగా జరుగుతుంది. డాక్యుమెంట్ లోపాలు ఉంటే లోన్ అప్లికేషన్ రిజెక్ట్ లేదా ఆలస్యం కావొచ్చు.

