Homeబిజినెస్Insurance : భవితకు భరోసా.. బీమాతోనే ధీమా: టర్మ్ ఇన్సూరెన్స్ లెక్క తేల్చేదెలా?

Insurance : భవితకు భరోసా.. బీమాతోనే ధీమా: టర్మ్ ఇన్సూరెన్స్ లెక్క తేల్చేదెలా?

Term insurance coverage calculation : జీవితం అనిశ్చితుల మయం. కుటుంబానికి పెద్ద దిక్కైన సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా దూరమైతే ఆ ఇల్లు ఆర్థికంగా కుంగిపోకుండా నిలబెట్టే సంజీవని ‘టర్మ్ ఇన్సూరెన్స్’. అయితే చాలామంది కవరేజీ విషయంలో పొరపాటు పడుతుంటారు. కేవలం నామమాత్రపు మొత్తంతో పాలసీ తీసుకుని సరిపెట్టుకుంటారు. అసలు మీ కుటుంబ జీవన ప్రమాణాలకు ఏ మొత్తం నిజమైన రక్షణనిస్తుంది? మీకున్న అప్పులు, పిల్లల భవిష్యత్తుకు ఆ కవరేజీ ఏమేరకు సరిపోతుంది?

- Advertisement -

ఆర్థిక నిపుణుల మార్గదర్శకాల ప్రకారం సరైన కవరేజీని లెక్కించే సూత్రాలివే:
ఆదాయ భర్తీ విధానం (Income Replacement): వ్యక్తి లేని లోటును బీమా మొత్తం భర్తీ చేయాలి. కుటుంబ ప్రస్తుత ఖర్చులు, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని వార్షికాదాయానికి కనీసం 10 నుంచి 15 రెట్లు కవరేజీ ఉండేలా చూడాలి.

రుణాల భారం తప్పనిసరి: గృహ రుణం (Home Loan), వాహన, వ్యక్తిగత రుణాలు ఉంటే ఆ బాధ్యత కుటుంబంపై పడకుండా, మొత్తం రుణ విలువను బీమా అవసరానికి తప్పక కలపాలి.

దీర్ఘకాలిక లక్ష్యాలు: పిల్లల ఉన్నత చదువులు, వివాహాల వంటి భవిష్యత్ అవసరాలను లెక్కగట్టి బీమాకు జోడించాలి.

ఆస్తుల మినహాయింపు: ఇప్పటికే ఉన్న పీఎఫ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను మొత్తం అవసరం నుంచి తీసివేయగా వచ్చే నికర మొత్తాన్నే టర్మ్ పాలసీగా ఎంచుకోవాలి.

మూడేళ్లకో సమీక్ష: వివాహం, పిల్లల జననం, కొత్త అప్పులు చేసినప్పుడు ఆర్థిక బాధ్యతలు పెరుగుతాయి. కాబట్టి ప్రతి 3 నుంచి 5 ఏళ్లకోసారి పాలసీ సరిపోతుందో లేదో సమీక్షించుకుని అదనపు కవరేజీ తీసుకోవడం ఉత్తమం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News