Sunday, November 16, 2025
Homeబిజినెస్Will Format : వీలునామా రాస్తున్నారా..? ప్రియమైన వారికి ఆస్తులు సురక్షితంగా దక్కాలంటే ఇలా చేయండి

Will Format : వీలునామా రాస్తున్నారా..? ప్రియమైన వారికి ఆస్తులు సురక్షితంగా దక్కాలంటే ఇలా చేయండి

Will Format : ఈరోజుల్లో ఆస్తుల పంచాయితీలు కోర్టులకు వెళ్లి ఏళ్లకు ఏళ్లు పరిష్కారం కాకుండా ఉంటున్నాయి. దీనికి ఒక కారణం తల్లిదండ్రులు తమ పిల్లలకు చెందాల్సిన ఆస్తులపై సరైన వీలునామా లేకుండా మరణించటమే. చట్టపరమైన సమస్యల నుంచి తప్పించుకోవాలంటే వీలునామా ఎలా రాయాలి అందులో ఏవేవి ఉండాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

- Advertisement -

వీలునామా గురించి ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా ప్రజలకు వారసత్వ ఆస్తుల బదిలీ కోసం వారి వీలునామాలు సక్రమంగా తయారు చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వారు చేస్తున్న కొన్ని ప్రధాన తప్పుల వల్ల వారసులకు ఆస్తులు అందకుండానే వివాదాలు, ఆలస్యం ఏర్పడుతున్నాయని వివరించారు. వీలునామా అంటే ఒక వ్యక్తి తన మరణానంతరం ఆస్తుల పంచకం ఎలా జరగాలని ముందుగానే రాసుకొనే చట్టబద్ధమైన డాక్యుమెంట్.

అహుజా చెప్పిన ముఖ్యమైన సూచనలు:
* చేతితో రాసిన వీలునామా మంచిది, ఎందుకంటే చేతి రాతకు అథెంటిసిటీ ఉంటుందని చెప్పారు. టైప్ చేసిన డాక్యుమెంట్ కంటే దీనికి గుర్తింపు ఎక్కువ.
* పేజీలు సరిగా నెంబర్లతో ఉండాలి. “1 of 10” వంటి ఫార్మాట్ ఉపయోగించాలి.
* వీలునామాలో ఒక చోట తప్పు చేస్తే మొత్తం వీలునామాను తిరిగి రాయాలి. మార్పులు, క్రాస్ చేయడాలు చేయకూడదు.
* వారసుల పూర్తి వివరాలు (పేరు, ఆథార్, పాన్ నంబర్, వాటా శాతం) స్పష్టంగా వీలునామాలో మెన్షన్ చేయాలి.
* వీలునామాకు సాక్షులుగా ఇద్దరు ఉండాలి. వారు లాయర్, సీఏ, లేదా డాక్టర్ అయితే ఉత్తమం.
* వీలునామా ఎగ్జిక్యూటర్(అమలు చేసే వ్యక్తి) ఒక నిర్పేక్షిత వ్యక్తి, కుటుంబంతో సంబంధం లేకుండా ఉండాలి.
* వీలునామాలో ఆస్తుల వివరాలు జాగ్రత్తగా రాయాలి. ముఖ్యంగా నగలు వంటి విలువైన వస్తువుల వివరాలు, రకాలు.. వాటి బరువు, వర్ణం, ఫోటోలతో కలిపి ఉండాలి.

ఈ విధంగా వీలునామా రాసుకోవడం ద్వారా కుటుంబంలో వారసత్వ వివాదాలు, ఆలస్యం తప్పుతుంది. ఆస్తులు సరిగ్గా, స్పష్టంగా వ్రాసి, చట్టపరమైన ప్రామాణికతను పాటించడం ముఖ్యమని అహుజా సూచించారు. 1925 భారత వారసత్వ చట్టం సెక్షన్ 63 ప్రకారం వీలునామా రాసే సమయంలో.. వ్యక్తి మెంటల్ కండిషన్ సరిగ్గా, ఆరోగ్యవంతంగా ఉండటం కూడా అవసరం. వైద్యం పొందుతూ, మత్తులో లేదా మానసికంగా ఏదైనా లోపం ఉంటే వీలునామాను సవాల్ చేసే అవకాశాలు ఉంటాయి.

త్వరగా చేతితో రాసిన వీలునామాలు కూడా చట్టబద్ధమే అయితే అందుకు సాక్షులు తప్పనిసరి. వీలునామా రిజిస్ట్రేషన్ ఐతే ఆ సాక్ష్యం మరింత బలంగా ఉంటుంది. వివాదాల నుండి తప్పించుకోవడానికి అస్పష్టతలు లేకుండా స్పష్టంగా, పూర్తి సమాచారం ఇచ్చి చేసిన డాక్యుమెంట్ సురక్షితం చేయాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad