Saturday, March 14, 2026
HomeTop StoriesHuawei Watch GT Runner 2: ప్రీమియం లుక్.. అదిరే ఫీచర్లు.. హువావే వాచ్ GT...

Huawei Watch GT Runner 2: ప్రీమియం లుక్.. అదిరే ఫీచర్లు.. హువావే వాచ్ GT రన్నర్ 2 ఎంట్రీ

Huawei Watch GT Runner 2: ప్రొఫెషనల్ రన్నింగ్ వాచ్‌ల విభాగంలో మళ్లీ తన స్థానాన్ని మార్కెట్‌లో ఆధిపత్యం సాధించాలని లక్ష్యంగా హువావే కొత్త స్మార్ట్‌వాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. హువావే వాచ్ GT రన్నర్ 2 అనే ఈ మోడల్ ఐదు సంవత్సరాల తర్వాత ప్రత్యేకంగా రన్నర్ల కోసం రూపొందించిన వాచ్‌గా మార్కెట్‌లోకి వచ్చింది. మాడ్రిడ్‌లో జరిగిన అంతర్జాతీయ కార్యక్రమంలో ఈ వాచ్‌ను అధికారికంగా పరిచయం చేశారు. ఇదే ఈవెంట్‌లో కంపెనీ తన కొత్త ఫోన్, టాబ్లెట్‌లను కూడా చూపించినప్పటికీ, ఎక్కువ చర్చకు కారణమైనది మాత్రం ఈ రన్నింగ్ వాచ్.

- Advertisement -

ప్రీమియం డిజైన్ – టైటానియం బిల్డ్

ఈ వాచ్ డిజైన్‌లోనే ప్రత్యేకత కనిపిస్తుంది. కేస్, బెజెల్, క్రౌన్, బటన్‌లు అన్నీ టైటానియం అలాయ్‌తో తయారు చేశారు. అందువల్ల ఇది బలంగా ఉండటమే కాకుండా చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. స్ట్రాప్ లేకుండా దాదాపు 34.5 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. 43.5×43.5×10.7 మిల్లీమీటర్ల సైజుతో ఇది చేతికి సౌకర్యంగా సరిపోతుంది. AirDry వోవెన్ స్ట్రాప్ గాలి ప్రవాహాన్ని 25 శాతం వరకు పెంచుతుందని కంపెనీ చెబుతోంది. దీని వల్ల ఎక్కువసేపు వాచ్ వేసుకున్నా అసౌకర్యం అనిపించదు.

3000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో AMOLED డిస్ప్లే

1.32 అంగుళాల AMOLED డిస్ప్లే ఈ వాచ్‌లో అందించారు. 466×466 పిక్సెల్ రిజల్యూషన్‌తో స్పష్టమైన విజువల్స్ కనిపిస్తాయి. గరిష్టంగా 3000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. రెండో తరం కున్‌లున్ గ్లాస్ రక్షణ ఉండటంతో స్క్రాచ్‌ల నుంచి తగినంత రక్షణ లభిస్తుంది.

ఇంటెలిజెంట్ మారథాన్ మోడ్ – రన్నర్లకు ప్రత్యేక సహాయం

ఈ వాచ్‌లో ప్రధాన ఆకర్షణ ఇంటెలిజెంట్ మారథాన్ మోడ్. ఇది ప్రొఫెషనల్ రన్నింగ్ టీమ్ సహకారంతో అభివృద్ధి చేయబడింది. రన్నర్లకు వ్యక్తిగత ట్రైనింగ్ ప్లాన్స్, రేస్ ప్రిపరేషన్ గైడెన్స్, రియల్ టైమ్ రేస్ డేటా అందిస్తుంది. పరుగులో స్పీడ్ ఎంత ఉంది, ఫినిషింగ్ టైమ్ అంచనా ఎంత, టార్గెట్‌కు ఇంకా ఎంత దూరం ఉందో వెంటనే తెలుసుకోవచ్చు. డిజిటల్ పేసర్, ఫ్యూయెలింగ్ రిమైండర్స్ వంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. లాక్టేట్ థ్రెషోల్డ్, రన్నింగ్ పవర్, రన్నింగ్ ఎబిలిటీ ఇండెక్స్ వంటి అడ్వాన్స్ మెట్రిక్స్‌ను కూడా ట్రాక్ చేయవచ్చు.

3D ఫ్లోటింగ్ యాంటెన్నా – 20 శాతం మెరుగైన GPS

ఈ వాచ్‌లో 3D ఫ్లోటింగ్ యాంటెన్నా ఆర్కిటెక్చర్‌ను ప్రవేశపెట్టారు. ఇది పూర్వ మోడళ్లతో పోలిస్తే 20 శాతం వరకు పొజిషనింగ్ అక్యూరసీ పెంచుతుందని కంపెనీ చెబుతోంది. డ్యూయల్ బ్యాండ్ L1+L5 GPS సపోర్ట్ ఉంది. గ్లోనాస్, బైడౌ, గెలిలియో, క్యుజెడ్‌ఎస్ఎస్, నావిక్ వంటి శాటిలైట్ సిస్టమ్‌లకు సపోర్ట్ అందిస్తుంది. టన్నెల్‌లలో లేదా ఎత్తైన భవనాల మధ్య సిగ్నల్ కొద్దిసేపు కోల్పోయినా రూట్, డిస్టెన్స్ లెక్కించడం కొనసాగుతుంది.

100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు

ఈ వాచ్ కేవలం రన్నింగ్‌కే పరిమితం కాదు. 100కు పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ట్రయిల్ రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, గోల్ఫ్, ఫ్రీడైవింగ్ వంటి విభాగాల్లో కూడా ట్రాకింగ్ అందిస్తుంది. 40 మీటర్ల లోతు వరకు ఫ్రీడైవింగ్ సపోర్ట్ ఉంది. 5ATM, IP69 సర్టిఫికేషన్లు ఉండటంతో నీరు, దుమ్ము నుంచి రక్షణ లభిస్తుంది.

Read Also: OnePlus 15T Leaked: గేమర్స్‌కి పండగే.. 165Hz డిస్‌ప్లేతో వన్‌ప్లస్ కొత్త సంచలనం 15T

హెల్త్ మానిటరింగ్ పూర్తి స్థాయిలో

ECG మానిటరింగ్, హార్ట్ రేట్ వెరీయబిలిటీ అనాలిసిస్, బ్లడ్ ఆక్సిజన్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్, స్ట్రెస్ మేజర్‌మెంట్ వంటి హెల్త్ ఫీచర్స్ ఉన్నాయి. ఫిట్‌నెస్ తర్వాత రికవరీ ఇన్‌సైట్స్, బాడీ ఫామ్ అనాలిసిస్ వంటి వివరాలను హెల్త్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

బ్యాటరీ – గరిష్టంగా 14 రోజుల బ్యాకప్

బ్యాటరీ విషయానికి వస్తే లైట్ యూజ్‌లో 14 రోజులు వరకు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. సాధారణ వాడకంలో 7 రోజులు, అవుట్‌డోర్ వర్కౌట్ మోడ్‌లో ప్రిసైస్ GPS ఆన్ చేసి 32 గంటలు వరకు పనిచేస్తుంది. వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.

ఇండియాలో ధర ఎంతంటే?

యూకే మార్కెట్‌లో ఈ వాచ్ ధర GBP350గా నిర్ణయించారు. భారత కరెన్సీలో దాదాపు రూ.42,900 వరకు ఉంటుంది. డాన్ ఆరెంజ్, డస్క్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఇతర మార్కెట్లలో విడుదలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం టైటానియం బిల్డ్, 3000 నిట్స్ డిస్ప్లే, 14 రోజుల బ్యాటరీ, 20 శాతం మెరుగైన GPS అక్యూరసీ వంటి అంశాలు దీనిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. రన్నింగ్‌పై పూర్తి ఫోకస్ పెట్టే వారికి ఇది ఒక పవర్‌ఫుల్ స్మార్ట్‌వాచ్ ఎంపికగా మారే అవకాశముంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News