Huge rise in silver rate: అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్‌లో అనిశ్చితి కారణంగా బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గురువారం ఉదయం తగ్గినట్లే తగ్గిన బంగారం, వెండి ధరలు.. మధ్యాహ్నానికి ఊహించని షాక్ తగిలింది. ఉదయం రూ.15 వేలు తగ్గిన వెండి రేటు.. మధ్యాహ్నానికి ఏకంగా రూ.10 వేలు పెరిగింది. అనూహ్యంగా వెండి ధర పెరగడంతో కొనుగోలుదారులు షాకవ్వడం వారి వంతైంది.
Also read: Tata Tiago Cars: టాటా నుంచి మిడిల్ క్లాస్ కారు.. కేవలం రూ. 5 లక్షల్లోపే అధిరిపోయే ఫీచర్లతో లాంచ్..!
రూ. 2,85,000 లక్షలకు చేరిన కిలో వెండి..
కాగా, మార్కెట్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,85,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రేటుకు జీఎస్టీ, తరుగు అదనం. వెండి ధర తగ్గుతుండటంతో ఒక్కసారిగా కొనుగోలుకు ఎగబడ్డారు. దీంతో, డిమాండ్ అమాంతం పెరిగి రేటు కూడా పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, బంగారం రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలతో కలిపి రూ.1,80,031గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,65,022 వద్ద స్ధిరపడింది.

