Hyderabad : భారతీయ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కొన్ని సంవత్సరాల పాటు దేశంలోని మిగతా నగరాలకు సవాల్ విసిరిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా ఇప్పుడు మందగమనాన్ని చవిచూస్తున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల అమ్మకాలు తగ్గుతున్న వేళ, హైదరాబాద్ మార్కెట్‌లో కనిపించిన ఈ నెమ్మది ఆందోళన కలిగిస్తోంది.
తగ్గిన అమ్మకాలు, పెరిగిన ధరలు
అనరాక్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నివేదిక ప్రకారం, ఈ ఏడాది జూలై నుండి సెప్టెంబర్ మధ్య దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు గతేడాదితో పోలిస్తే 9 శాతం వరకు పతనం అయ్యాయి. గత ఏడాది 1,07,060 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈసారి ఆ సంఖ్య 97,080 యూనిట్లకు పరిమితమైంది.హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణె, బెంగళూరు నగరాల్లో అమ్మకాల తగ్గుదల స్పష్టంగా కనిపించింది.అయితే, చెన్నై (33% వృద్ధి), కోల్‌కతా (4% పెరుగుదల) నగరాలు మాత్రం ఈ మందగమనం నుంచి బయటపడ్డాయి.
RBI: డిజిటల్ చెల్లింపుల్లో కొత్త నిబంధనలు
హైదరాబాద్ విషయంలో, ఒకప్పుడు ఐటీ, ఫార్మా రంగాల ప్రోత్సాహం వల్ల దశాబ్ద కాలం పాటు నిర్మాణం జోరుగా సాగింది. అయితే, ఇతర నగరాల తరహాలో ఇప్పుడు ఇక్కడ కూడా అమ్మకాల్లో ఉత్సాహం కొంత తగ్గింది.
లగ్జరీ ఇళ్లకు మాత్రమే డిమాండ్
యూనిట్ల సంఖ్య తగ్గినప్పటికీ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఒక ఊరట కలిగించే అంశం ఉంది. నగరంలో విక్రయాల విలువ మాత్రం గణనీయంగా పెరిగింది. అనరాక్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో గృహ విక్రయాల విలువ గతేడాది కంటే 14 శాతం పెరిగింది.గత ఏడాది రూ.1.33 లక్షల కోట్ల విలువగల సేల్స్ నమోదు కాగా, ఈసారి అది రూ.1.52 లక్షల కోట్లకు చేరుకుంది. దీనికి ముఖ్య కారణం:
ఇంటి ధరలు పెరగడం
ముఖ్యంగా లగ్జరీ ఇళ్లకు (ప్రీమియం సెగ్మెంట్) డిమాండ్ పెరగడం.అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి తెలిపిన వివరాల ప్రకారం, మధ్య తరగతి మరియు దిగువ తరగతి కొనుగోలుదారులు వెనక్కి తగ్గినా, అధిక ఆదాయం కలిగిన వర్గాలు మాత్రం ఖరీదైన ఇండ్ల కొనుగోళ్లకే ఆసక్తి చూపుతున్నాయి. అంటే, సాధారణ మార్కెట్ మందగమనాన్ని ఎదుర్కొంటుండగా, ప్రీమియం సెగ్మెంట్ మాత్రం రాణిస్తోంది. రాబోయే రోజుల్లో కొనుగోలుదారుల శక్తి ఆధారంగా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అసమానతలు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.


