Homeబిజినెస్Hyundai: షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న హ్యూందాయ్‌ కార్ల ధరలు.. ఎప్పటి నుంచంటే?

Hyundai: షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న హ్యూందాయ్‌ కార్ల ధరలు.. ఎప్పటి నుంచంటే?

Hyundai car prices to increase: ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థ హ్యుందాయ్‌ కారు ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. త్వరలోనే అన్ని వేరియంట్ల ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. వేరియంట్‌ను బట్టి రూ. 12,800 వరకు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. జూన్‌ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయని, కస్టమర్లు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇప్పటికే సమాచారం ఇచ్చింది. కమొడిటీ, ముడిసరకుల ధరలు పెరగడంతో కార్యకలాపాల వ్యయం భారంగా మారిందని, దీంతో కార్ల ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పాడిందని వివరించింది. అయితే, కారు వేరియంట్లు, మోడళ్ల ఆధారంగా ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. వినియోగదారులపై భారం మోపాలనే ఉద్దేశం సంస్థకు లేదని, మార్కెట్‌ ధరల ప్రభావం కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. కాగా, రెండ్రోజుల క్రితం దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి సైతం తమ అన్ని వేరియంట్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు, అదే బాటలో హ్యుందాయ్‌ కూడా ధరల పెంపును ప్రకటించింది.

- Advertisement -

Also read: Karnataka CM Change: ఢిల్లీలో చక్రం తిప్పిన డీకే.. సిద్ధూకి చెక్‌?.. 30నే సీఎంగా ప్రమాణస్వీకారం?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News