Whiskey : సాధారణంగా శీతాకాలం అంటే రమ్ సీజన్ అంటారు. కానీ ఈసారి విస్కీ మార్కెట్‌లో ఒక బ్రాండ్ పేరు మారుమోగిపోతోంది. అదే ఇంపీరియల్ బ్లూ. భారతీయ మద్యం మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న ఈ బ్రాండ్, ఇటీవల యాజమాన్యం మారిన తర్వాత సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇంపీరియల్ బ్లూ గతంలో ఫ్రెంచ్ దిగ్గజం పెర్నో రికా చేతిలో ఉండేది. అయితే, భారతీయ కంపెనీ తిలక్‌నగర్ ఇండస్ట్రీస్ సుమారు రూ. 4000 కోట్లు వెచ్చించి ఈ బ్రాండ్‌ను సొంతం చేసుకుంది. ఇది భారతీయ మద్యం రంగంలోనే అతిపెద్ద ఒప్పందాలలో ఒకటిగా నిలిచింది.
అమ్మకాల్లో ఆల్‌టైమ్ రికార్డు
తిలక్‌నగర్ ఇండస్ట్రీస్ చేతికి వచ్చిన తర్వాత ఈ బ్రాండ్ దశ తిరిగింది. తాజా గణాంకాల ప్రకారం.. ఒక్క దఫాలోనే దాదాపు 1.79 మిలియన్ల (17.9 లక్షలు) బాటిళ్లను విక్రయించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. భారతీయ విస్కీ మార్కెట్‌లో ఇంపీరియల్ బ్లూ వాటా ఏకంగా 9%. దేశవ్యాప్తంగా ఏటా 2.24 కోట్ల కేసుల విక్రయాలతో, పరిమాణం పరంగా ఇది దేశంలోనే మూడవ అతిపెద్ద విస్కీ బ్రాండ్గా నిలిచింది.
MSMEలకు డిజిటల్ వరం..రూ. 52,300 కోట్ల రుణాలతో సరికొత్త రికార్డు
ఇంత క్రేజ్ ఎందుకు?
ఇంపీరియల్ బ్లూ ఇంతలా దూసుకుపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.సామాన్యుడికి అందుబాటులో ఉండే ధర దీని ప్లస్ పాయింట్. ఉదాహరణకు ఢిల్లీలో 180 మి.లీ. బాటిల్ కేవలం రూ. 180 కే లభిస్తుండగా, ఫుల్ బాటిల్ ధర రూ. 600 లోపే ఉంటోంది. తక్కువ ధరలో అద్భుతమైన క్వాలిటీ మరియు రుచిని అందించడం వల్ల యువత మరియు మధ్యతరగతి ప్రజల్లో దీనికి విపరీతమైన ఆదరణ ఉంది.
విస్కీ మార్కెట్‌లో ఆధిపత్యం
దేశంలో ఏడాదికి సుమారు 7.9 కోట్ల కేసుల విస్కీ అమ్ముడవుతుండగా, అందులో సింహభాగాన్ని సొంతం చేసుకోవాలని తిలక్‌నగర్ ఇండస్ట్రీస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇంపీరియల్ బ్లూ కొనుగోలుతో ఆ కంపెనీ విస్కీ మార్కెట్‌పై తన పట్టును మరింత బలోపేతం చేసుకుంది.
యాజమాన్యం మారినా, బ్రాండ్ విలువ తగ్గకపోగా.. తిలక్‌నగర్ వ్యూహాలతో ‘ఇంపీరియల్ బ్లూ’ ఇప్పుడు భారతీయ మద్యం ప్రియుల నంబర్ వన్ ఛాయిస్‌గా మారుతోంది. ఈ జోరు చూస్తుంటే ముందు ముందు మరిన్ని రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

