New Delhi: భారతీయ పోస్టల్ వ్యవస్థను ఒక ప్రపంచ స్థాయి ప్రజా లాజిస్టిక్స్ సంస్థగా మార్చే దిశగా అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వ ఆవిష్కరణలలో భాగంగా, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దేశవ్యాప్తంగా అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ (APT)ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు రూ. 5,800 కోట్ల పెట్టుబడితో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2.0 (IT 2.0) లో భాగంగా అమలవుతోంది.
APT వ్యవస్థ పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేయబడింది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా సంకల్పాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంది. “భారతదేశ డిజిటల్ ప్రయాణంలో ఒక చారిత్రాత్మక అడుగు – ఇండియా పోస్ట్ ఆఫీస్ ద్వారా APT దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుందని ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది,” అని సింధియా సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్)లో పేర్కొన్నారు.
Read more: https://teluguprabha.net/news/airtel-rs-249-prepaid-plan-removed-2025/
APT వేదిక ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పోస్ట్ ఆఫీసులు కూడా నగరాల మాదిరిగానే డిజిటల్ సేవల కేంద్రాలుగా మారతాయి. ఈ రూపాంతరం, గ్రామీణ డిజిటలీకరణ, ఆర్థిక సమావేశం, మరియు తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవలు అందించడంలో కీలకపాత్ర పోషించనుంది.
APT ద్వారా ఇండియా పోస్ట్ కి ఆధునిక సౌకర్యాలు లభించనున్నాయి. ఇప్పటివరకు కేవలం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకే యూపీఐ లావాదేవీలు అందుబాటులో ఉండేవి. ఇకపై ఎలాంటి బ్యాంకు ఖాతా ఉన్న వినియోగదారుడైనా పోస్ట్ ఆఫీసు సేవల కోసం యూపీఐ ద్వారా చెల్లింపులు చేయగలుగుతారు.
Read more: https://teluguprabha.net/business/mandatory-product-labeling-india-ecommerce/
APT ద్వారా వినియోగదారులు మొబైల్ రెడీ సేవలు పొందగలుగుతారు. పోస్ట్ ఆఫీసు సేవలు మొబైల్ ఫోన్ ద్వారా ఎక్కడినుండైనా పొందగలిగేలా వ్యవస్థను సిద్ధం చేయబడింది. పోస్టల్ కార్యకలాపాలను సమయానుకూలంగా విశ్లేషించి, పక్కా నిర్ణయాలు తీసుకునే సాంకేతిక శక్తిని APT కలిగి ఉంటుంది. ఆధునిక లాజిస్టిక్స్ సంస్థల మాదిరిగా, ఇండియా పోస్ట్ కూడా పార్సిల్ ట్రాకింగ్, డెలివరీ మెట్రిక్స్, డేటా అనలిటిక్స్ వంటి అంశాల్లో ముందంజ వేయనుంది.


