Wholesale Price Index(WPI): భారతదేశంలో ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, 2025 జూలైలో WPI ఆధారంగా వార్షిక ద్రవ్యోల్బణ రేటు -0.58 శాతానికి చేరింది. ఇది గత రెండేళ్లలో కనిస్థ స్థాయి కావడం గమనార్హం. ప్రధానంగా ఆహార వస్తువులు, పెట్రోల్, డీజిల్ మరియు సహజ వాయువు వంటి ఇంధనాల ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణ రేటు తగ్గింది.
WPI రేటు తగ్గడానికి ప్రధాన కారణాలు:
- ఆహార పదార్థాలు, జెనరల్ ఫ్యూయల్స్ (పెట్రోల్, డీజిల్, నేచురల్ గ్యాస్) ధరల తగ్గుదల
- జూలై నెలలో ఫుడ్ ఇండెక్స్ 2.15 శాతం తగ్గగా, ఇంధన ధరలు 2.43 శాతం తగ్గాయి.
- జూన్‌లో -0.13 శాతం ఉన్న WPI రేటు, జూలైలో మరింత తగ్గింది.
మార్చి నుండి WPI ఆధారిత ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతూ మే నెలలో 14 నెలల కనిష్ట స్థాయి 0.39 శాతానికి చేరుకుంది. ఈ ధరల తగ్గుదల వృద్ధి వర్గాల్లో ఉత్పత్తుల ధరలను ప్రభావితం చేస్తూ రిటైల్ మార్కెట్‌లో కూడా ధరల తగ్గుదలకు దారితీస్తుంది.
Read more: https://teluguprabha.net/business/sbi-agniveer-collateral-free-loan-independence-day-offer/
WPI ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే బల్క్ వస్తువుల ధరల తగ్గుదల రిటైల్ స్థాయికి బదిలీ చేయబడుతుంది మరియు ఇంధన ధరల తగ్గుదల రవాణా ఖర్చులలో తగ్గుదలకు దారితీస్తుంది.
వినియోగదారుల ధరల సూచిక (CPI) ఆధారంగా గణించబడే ద్రవ్యోల్బణం కూడా జూలై 2025లో గణనీయంగా తగ్గింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే CPI ద్రవ్యోల్బణం 1.55 శాతానికి పడిపోయింది. జూన్ 2017 తర్వాత ఇదే కనిష్ట స్థాయి అని గణాంకాలు తెలుపుతున్నాయి. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.1 శాతంగా ఉండగా, ఇప్పుడు 55 బేసిస్ పాయింట్లు తగ్గడం గమనార్హం. జనవరి 2019 తర్వాత ఇదే అత్యల్ప స్థాయి.
Read more: https://teluguprabha.net/business/odysse-sun-electric-scooter-launched-in-india/
మాన్సూన్ అభివృద్ధి, ఖరీఫ్ పంటలు బాగా సాగు కావడం, రిజర్వాయర్లు నిండుగా ఉండటం వంటి అంశాలు కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 సంవత్సరానికి సీపీఐ ద్రవ్యోల్బణం 3.1 శాతంగా అంచనా వేసింది.
జూన్‌లో 2025-26 ద్రవ్యోల్బణం అంచనాలు ఊహించిన దానికంటే మరింత సానుకూలంగా మారాయని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల అన్నారు. అయితే 2025-26 చివరి త్రైమాసికం (Q4) నాటికి సీపీఐ మళ్లీ 4 శాతం మించి చేరే అవకాశం ఉంది. ఇందులో భాగంగా కొన్ని పాలసీ నిర్ణయాలు, డిమాండ్-సైడ్ కారణాలు ప్రభావితం చేయవచ్చు.


