Bull Market: 2025 సెప్టెంబర్ 1న భారత స్టాక్ మార్కెట్లు బలమైన ర్యాలీని కనబరిచాయి. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ నాటికి సెన్సెక్స్ 80,364 వద్ద ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 24,600 పాయింట్ల పైగా ముగిసింది. దీంతో పెట్టుబడిదారుల సంపద రూ.5 లక్షల కోట్ల మేర పెరిగింది.
మార్కెట్ ర్యాలీకి కారణాలు..
ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో పాటు గ్లోబల్ ఉద్రిక్తతలు తక్కువ అవడం, ముఖ్యంగా భారత ప్రధాని ఇటీవలి జపాన్, చైనా పర్యటనలు, రష్యాతో ఉక్రెయిన్ యుద్ధంపై శాంతికి పిలువ వంటి అంశాలు దేశీయ ఇన్వెస్టర్లలో కొత్త నమ్మకాల ఆశలను చిగురింప చేస్తున్నాయి. దీనికి తోడు ఈనెల ఉండే యూఎస్ ఫెడ్ మానిటరీ పాలసీలో వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందని అంచనాలు కూడా మార్కెట్లలో టెన్షన్లను తగ్గిస్తున్నాయి.
దీనికి తోడు ఇతర కారణాలను గమనిస్తే.. 2025 మొదటి క్వార్టర్‌లో భారత GDP 7.8% పెరుగుదల సాధించటం. దీంతో భారత్ ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. దీని ప్రభావంతో మార్కెట్ నమ్మకాలు పెరిగాయి. అలాగే ప్రధాని మాట ఇచ్చినట్లుగా GST కౌన్సిల్ సమావేశంలో వచ్చే అవకాశాలపై సానుకూల అంచనాలు ఇన్వెస్టర్లను కోలాహలంలో నింపుతున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ తో పాటు ఆటో, IT, మీడియా రంగాల్లో కొనుగోళ్ల జోష్ మార్కెట్లను ముందుకు నడిపించింది.
సెప్టెంబర్ నెలలో సాధారణంగా మార్కెట్లు మితంగా ఉంటాయని.. ఇన్వెస్టర్లు జాగ్రత్త పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 2025 సెప్టెంబర్ 1 తేదీన, భారతీయ స్టాక్ మార్కెట్స్ భారీగా ర్యాలీ చేసి ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్ల మేర పెరిగింది. నేడు బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.444 లక్షల కోట్ల నుంచి రూ.449 లక్షల కోట్లకు పెరిగింది.
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, దేశీయ ఆర్థిక బలము, గ్లోబల్ ఉద్రిక్తతలు తగ్గటం, ముఖ్య ఆర్థిక ఆకాంక్షల కారణంగా ఇలాంటి ర్యాలీలు సాధ్యమయ్యాయి. అయితే కొంతమంది నిపుణులు సెప్టెంబర్ నెల ప్రత్యేకంగా జాగ్రత్త అవసరమని కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే సీజనాలిటీకి అనుగుణంగా ఈ నెలలో సాధారణంగా మార్కెట్లు మితంగా గతంలో పెర్ఫామ్ చేసిన అంశాన్ని వారు గుర్తు చేస్తున్నారు. దీంతో దాదాపు 6 నెలల కాలంలో నేడు మార్కెట్లు మంచి బలమైన బుల్ జోరుతో ఇన్వెస్టర్లను ముందుకు నడిపించాయి.


