Monday, June 23, 2025
Homeబిజినెస్Indian money in Swiss bank : స్విస్ బ్యాంకులో 3 రెట్లు పెరిగిన భారతీయుల...

Indian money in Swiss bank : స్విస్ బ్యాంకులో 3 రెట్లు పెరిగిన భారతీయుల డబ్బు

Money increased in Swiss bank : స్విస్ బ్యాంక్ అంటే అందరికీ నల్లధనం (బ్లాక్ మనీ) గుర్తుకొస్తుంది. ఇటీవల భారత్ నుంచి మళ్లీ స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతున్నాయి. అవును భారతదేశ పౌరులు పెద్ద మొత్తంలో విదేశీ బ్యాంకుల్లో డబ్బు జమ చేయడం మరోసారి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా స్విస్ నేషనల్ బ్యాంక్ భారతీయుల డిపాజిట్ మనీ మొత్తం వివరాలను వెల్లడించగా, భారతీయుల ఆస్తులు మూడు రెట్లు పెరిగాయి. తాజాగా డేటా ప్రకారం, భారతీయులు స్విస్ బ్యాంకుల్లో రూ.37,600 కోట్లు జమ చేసినట్లు వెల్లడైంది. ఈ సమాచారం ఆసక్తి కల్గిస్తోంది. ఈ మొత్తాన్ని గమనిస్తే, భారతీయుల గ్లోబల్ ఫైనాన్షియల్ ప్రెజెన్స్ ఎంతగా విస్తరించిందో అర్థమవుతుంది.

- Advertisement -

అయితే, భారతీయ కస్టమర్ల వ్యక్తిగత ఖాతాల్లో జమ అయిన మొత్తం 11 శాతం పెరిగింది . ఈ మొత్తం 34.6 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు (సుమారు రూ. 3,675 కోట్లు) ఉంటుంది.

2023లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు 70% తగ్గి నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయి 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు చేరుకుంది. 2024 లో ఈ మొత్తం మళ్లీ 2021 తర్వాత అత్యధిక స్థాయికి పెరిగింది. 2021లో ఈ సంఖ్య 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు, ఇది 14 సంవత్సరాలలో అత్యధిక స్థాయి కావడం గమనార్హం.

స్విస్ బ్యాంకులు అత్యంతగా గోప్యతను పాటిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో వీటిలో జమయ్యే డబ్బు ఎక్కువగా బ్లాక్ మనీ అనే ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. స్విట్జర్లాండ్, భారతదేశం మధ్య ఉన్న ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ ఒప్పందం ప్రకారం, స్విస్ బ్యాంకులు భారతీయ ఖాతాదారుల సమాచారం భారత ప్రభుత్వానికి పంపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు విదేశాల్లో అక్రమ డబ్బు దాచడం మరింత కష్టమైనదిగా మారింది.

స్విస్ బ్యాంక్ లో తాజాకాగా బయటపడిన రూ.37,600 కోట్ల డిపాజిట్లు అంతా బ్లాక్ మనీ మాత్రం కాదు. భారతీయులలో చాలా మంది వ్యాపార అవసరాల కోసం, ఇంటర్నేషనల్ పెట్టుబడుల కోసం లేదా నిబంధనల మేరకు విదేశాల్లో అకౌంట్లు నిర్వహించడం సాధారణ విషయనే విషయం తెలుసుకోవాలి. చాలామంది ఎన్‌ఆర్‌ఐలు కూడా స్విస్ బ్యాంకింగ్ సేవలను వినియోగిస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం పారదర్శకతను పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. బ్లాక్ మనీ చట్టం, బినామీ ఆస్తుల చట్టాలు, విదేశీ ఆస్తులపై పన్నుల నిబంధనలు వంటి వాటి ద్వారా ప్రభుత్వానికి మరింత సమాచారం అందుతుంది. అయితే ప్రజలు కూడా చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. విదేశాల్లో సంపద ఉండటం తప్పు కాదు, కానీ దాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం మాత్రం శిక్షార్హం అవుతుంది. వెల్లడించని డబ్బు చట్టవిరుద్ధమైన, లేదా బ్లాక్ మనీగా పరిగణిస్తారు.

భారతదేశం 48వ స్థానం

స్విస్ బ్యాంకుల్లో ఉన్న విదేశీ ఖాతాదారుల మొత్తం సంపద 2024 నాటికి తగ్గనుంది. ఈ జాబితాలో బ్రిటన్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత అమెరికా, వెస్టిండీస్ ఉన్నాయి. 2023 చివరి నాటికి 67వ స్థానంలో ఉన్న భారతదేశం జాబితాలో 48వ స్థా నికి చేరింది.

పాకిస్తాన్, బంగ్లాదేశ్ పరిస్థితి

స్విస్ బ్యాంకుల్లో పాకిస్తాన్ డబ్బు 286 మిలియన్ల నుండి 272 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు తగ్గింది. అయితే బంగ్లాదేశ్ నిధులు 18 మిలియన్ల నుండి 589 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు పెరిగాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News