Round Trip Package: పండుగల సీజన్ ప్రారంభమైంది. దేశంలో ప్రయాణాలు అధికంగా ఉండే ఈ సమయంలో భారతీయ రైల్వే శాఖ పండుగ లాంటి వార్త ప్రకటించింది. రౌండ్ ట్రిప్ పేరుతో ఒక పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో తిరుగు ప్రయాణంలో టికెట్ బుక్ చేసుకున్నట్లయితే టికెట్ ధరలో 20శాతం రాయితీ ఉంటుంది.
దేశ జనాభాలో అధిక శాతం ప్రజలు రైల్వే ప్రయాణానికే మొగ్గు చూపుతారు. ఈ పండుగల సమయంలో గ్రామాలకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో రద్దీ విపరీతంగా ఉంటుంది. రద్దీని తగ్గించి, ముందస్తు రిజర్వేషన్ లను పెంచడం, ప్రయాణికులపై ఒత్తిడిని తగ్గించడం వంటి నిర్ణయాలతో రైల్వే శాఖ రౌండ్ ట్రిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
Read more: https://teluguprabha.net/business/gold-and-silver-prices-increased-accross-the-india-today-again/
ఈ పథకంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లిన ప్రయాణికుడు, తిరుగు ప్రయాణంలో కూడా రైల్వే టికెట్ బుక్ చేసుకుంటే అందులో 20 శాతం రాయితీ వస్తుంది. రెండు వైపులా బుక్ చేసుకున్న టికెట్‌లు కన్ఫర్మ్ అయినప్పుడు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే మీరు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్తేనే ఈ రాయితీ ఉంటుంది. ఈ ప్రయాణంలో ఆన్ వర్డ్ లో మీరు ఎటువంటి సమాచారం ఇచ్చారో.. రిటర్న్ లో కూడా అదే సమాచారం ఉండాలి.
Read more:https://teluguprabha.net/business/nippon-india-midcap-fund-sip-wealth-creation/
ఈ పథకం ఆగష్టు 14, 2025 నుండి ప్రారంభమవుతుంది. 2025 అక్టోబర్ 13 నుంచి 26 మధ్య ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకోవాలి. తిరుగు ప్రయాణం నవంబర్ 17 నుంచి డిసెంబరు 1 మధ్య కనెక్టింగ్ జర్నీ ఫీచర్ ద్వారా బుక్ చేసుకోవాలి. అలాగే ఈ రిటర్న్ టికెట్ బుకింగ్‌కు ముందస్తు రిజర్వేషన్ పీరియడ్ నియమం వర్తించదు. రాజధాని, శతాబ్ధి, దురంతో ట్రైన్ లలో ఈ స్కీం వర్తించదు.


