New Delhi: ఆగష్టు 11,2025 నాడు భారత కరెన్సీ రూపాయి విలువ బలహీనపడింది. అమెరికా డాలర్ తో చూస్తే రూపాయి విలువ 17పైసలు తగ్గింది. ముడి చమురు ధరలు పెరగడం వల్ల రూపాయి విలువ 87.75 వద్ద ప్రతికూలంగా ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక మార్కెట్‌లో 87.56 వద్ద ప్రారంభమైన దేశీయ యూనిట్ మొదట లాభాల బాట పట్టిన చివరికి 87.75 వద్ద స్థిరపడింది.
ఈ వారంలో వెలువడనున్న అమెరికా ద్రవ్యోల్బణ (CPI) డేటా మార్కెట్‌లో కీలక భూమిక పోషించనుంది. USD-INR స్పాట్ ధర 87.35 నుండి 88.00 మధ్య మారవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఫ్యూచర్స్ ట్రేడ్‌లో బ్రెంట్ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 0.03 శాతం పెరిగి 66.61 డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో, ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ 0.10 శాతం పెరిగి 98.28 వద్ద ట్రేడయ్యింది.
Read more: https://teluguprabha.net/business/automated-multilevel-parking-project-in-hyderabad/
అంతర్జాతీయ రంగంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య వచ్చే వారం జరగనున్న చర్చలను భారత ప్రభుత్వం స్వాగతించింది. ఈ చర్చలు ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై దృష్టి సారించనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే, “ఇది యుద్ధ యుగం కాదని” స్పష్టంగా పేర్కొంటూ శాంతిపూర్వక పరిష్కారాన్ని కోరారు. చర్చలు మరియు దౌత్యం ద్వారా రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని ముగించాలని భారతదేశం నిరంతరం పిలుపునిస్తోంది.
దేశీయ ఈక్విటీ మార్కెట్ లో సెన్సెక్స్ 746.29 పాయింట్లు పెరిగి 80,604.08 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 221.75 పాయింట్లు పెరిగి 24,585.05 వద్ద ముగిసింది. ఇది దేశీయ మార్కెట్లకు బలాన్ని అందించినప్పటికీ, రూపాయి మద్దతుకు మాత్రం పూర్తి స్థాయిలో సహాయపడలేకపోయింది.
Read more: https://teluguprabha.net/news/huge-discounts-on-these-tata-cars-save-up-to-rs-1-lakh/
ఆగస్టు 1తో ముగిసిన వారంలో భారతీయ విదేశీ మారక నిల్వలు రూ. 9.322 బిలియన్ తగ్గి 688.871 బిలియన్ డాలర్లకు చేరాయిగత వారంలో మొత్తం నిల్వలు 2.703 బిలియన్ డాలర్లు పెరిగి 698.192 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ తగ్గుదల వెనుక విదేశీ ఆస్తుల విక్రయాలు మరియు మార్కెట్ యోచనలు కారణమని ఆర్బీఐ పేర్కొంది. ఈ విధంగా అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం మరియు వాణిజ్య సుంకాలపై కొనసాగుతున్న అనిశ్చితి దేశీయ కరెన్సీ మార్కెట్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి.


