Market Closing: అక్టోబర్ 3, 2025 న భారత స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ ఇంట్రాడే భారీ నష్టాల నుంచి550 పాయింట్లపాటు రీవర్స్ మెంట్ చూపించి. దీంతో చివరికి 224 పాయింట్లు లాభపడి చివరికి 81,207 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ స్వల్ప లాభాలతో 24,900కి సమీపంగా 24,894 వద్ద ముగిసింది. ఈ రోజు మార్కెట్ నష్టాల నుంచి రికవరీ వెనుక మెటల్ రంగంలో భారీ కొనుగోళ్లతో పాటు RBI ఆన్ లైన్ ప్రోత్సాహక చర్యలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. మెుత్తానికి శుక్రవారం రోజున మార్కెట్లో మెటల్, PSU బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్ సెక్టార్లు బలవంతంగా నిలవగా.. రియాల్టీ, హెల్త్‌కేర్ సెక్టార్లు కొంత వెనక్కుపడినట్లు కనిపించింది.
ఈవారం స్టాక్ మార్కెట్లు కొంత ఒడిదొడుకులతో కూడుకున్నప్పటికీ.. ప్రధాన సూచీకాంశాలు పాజిటివ్ మెుమెంటమ్ చూపించాయి. RBI రెపో రేటును మార్చకుండా కొనసాగించటం, ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుందనే అంచనాలు, భారత ఆర్థిక వృద్ధి 6.8%కి పెరిగిన వాతావరణం మార్కెట్‌లో విశ్వాసాన్ని పునరుద్ధరించాయి. బ్యాంకింగ్ రంగంలో హైలైట్‌గా కోటక్ మహీంద్రా, ICICI, HDFC బ్యాంకుల లాభాలు చూశాయి. నిఫ్టీ 24,600 మద్దతు స్థాయిని బలంగా నిలబెట్టుకొని ఇప్పుడు 25,000 పాయింట్ల దగ్గర సందడి చేస్తోంది.
మార్కెట్ రివర్స్ వెనుక ఐదు ముఖ్య కారణాలు: –
* మెటల్ రంగంలో టాటా స్టీల్, హిందాల్‌కో లాంటి కంపెనీల బలమైన ర్యాలీ
* RBI ద్రవ్య ప్రోత్సాహం, ద్రవ్యోల్బణంపై ఆశాజనక దృష్టికోణం
* గ్లోబల్ స్టీల్ దిగుమతులపై నియంత్రణలు, క్రూడ్ ధరల స్వల్ప తగ్గుదల
* ప్రభుత్వ పన్ను తగ్గింపులు, RBI లిక్విడిటీ ప్రోత్సాహం
* షార్ట్ కవరింగ్ వల్ల ట్రేడర్లు మార్కెట్లో మళ్లీ కొనుగోళ్లకు దిగటం
మొత్తానికి ఈ వారం అనిశ్చితులను అధిగమించిన తర్వాత మళ్లీ మార్కెట్ మూడ్ మార్పు లాభాల వెలుగులు నింపింది ఇన్వెస్టర్లలో. ఇటీవల గ్లోబల్ పరిస్థితులు, డొమెస్టిక్ పాలసీ మార్పులు పాజిటివ్ స్పందనకు దారితీసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ వారం మార్కెట్లలో ఇది ట్రెండ్ బలపడుతున్న సంకేతమనీ, దీర్ఘకాలంలో మార్కెట్ల పెరుగుదలకు సూచికగా వారు చెబుతున్నారు.


