Indian stock Markets:ఎనిమిది రోజుల లాభాల ర్యాలీకి బ్రేక్ చేస్తూ.. అంతర్జాతీయ ప్రకంపనలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై పెరుగుదల భయాలతో ఇవాళ భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 118 పాయింట్లు, నిఫ్టీ సుమారు 44 పాయింట్లు నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లు వెనుకడుగు వేయడం, సెప్టెంబర్ 17న జరగనున్న ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం నష్టాలకు ప్రధాన కారణాలుగా మారాయి. ఐటీ, ఫార్మా, FMCG రంగాలు ముఖ్యంగా ప్రభావితమయ్యాయి. మదుపర్లు తమ లాభాలను స్వీకరించడంతో పాటు FIIలు అమ్మకాల వైపు మొగ్గు చూపటం దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టేసింది.
దీంతో ట్రేడింగ్ ముగింపు సమయంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 118.96 పాయింట్లు నష్టపోయి 81,785.74 వద్ద స్థిరపడింది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఫెడ్ ఈ సారి 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను తగ్గించవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లలో బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్, ఎల్&టీ, అదానీ పోర్ట్స్ లాభాల్లో ముగియగా..సెన్సెక్స్ సూచీలో ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, టీసీఎస్, టెక్ మహీంద్రా వంటి స్టాక్స్ నష్టాల్లో తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.
మరో పక్క అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇటీవలి ట్రేడ్ టారిఫ్స్ కారణంగా మాంద్యం ముంగిట ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ట్రంప్ ఇండియా విషయంలో తనన కఠిన వైఖరిని తగ్గించుకున్నట్లు ఇటీవలి పరిణామాలుకూడా చెబుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ సన్నిహితుడు భారతదేశానికి ఇవాళ రాత్రి వస్తుండటం.. త్వరలోనే మంచి ట్రేడ్ డీల్ రెండు దేశాల మధ్య చిగురించవచ్చనే ఊహాగానాలకు పిలుపునిస్తోంది. ఇది ఫలవంతమైతే భారతీయ స్టాక్ మార్కెట్లు మరింతగా లాభపడవచ్చని నిపుణులు అంటున్నారు.


