Bull Rally: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు బలమైన లాభాలతో తమ ప్రయాణాన్ని ముగిశాయి. ఉదయం ఆరంభం నుంచే మంచి లాభాలతో ట్రేడింగ్ చూసిన మార్కెట్లు చివరి వరకు అదే బుల్ జోరును కొనసాగించటం గమనార్హం.
మార్కెట్ల క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ Nifty 25,966.05 వద్ద ముగియగా, మరో కీలక సూచీ Sensex 84,778.84 వద్ద క్లోజ్ అయ్యింది. మార్కెట్లలో భారీ ఉత్సాహానికి ప్రముఖ కారణాలుగా.. పాజిటివ్ గ్లోబల్ క్యూస్, ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపుపై పెరుగుతున్న ఆశలు, US–China ట్రేడ్ డీల్ న్యూట్రల్ పరిణామాలు, అలాగే విదేశీ పెట్టుబడుల భారతీయ స్టాక్ మార్కెట్లలోకి తిరిగి రాక వంటివి ఉన్నాయి.
నేడు మార్కెట్లో ప్రధానంగా మెటల్, రియల్టీ, PSU బ్యాంక్ స్టాక్స్ కొనుగోళ్ల వల్ల మేజర్ ర్యాలీని చూశాయి.ఈ క్రమంలో SBI Life, Bharti Airtel, Grasim, Reliance Industries వంటి కంపెనీల షేర్లు బిగ్ గెయిన్స్ చూశాయి. ఇదే క్రమంలో ఆటో, టెక్, ఆయిల్ & గ్యాస్ రంగాలకు కూడా మంచి డిమాండ్ కనిపించింది.అలాగే నేడు బుల్ జోరుతో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ కంపెనీల షేర్లు కూడా బలమైన ర్యాలీలో పాల్గొన్నాయి.
మార్కెట్ ర్యాలీకి ముఖ్యమైన కారణాలు..
* అమెరికా నుంచి వచ్చిన సాఫ్ట్ ద్రవ్యోల్బణం డేటా వల్ల ఫెడ్ రేటు తగ్గింపు ఆశలు గ్లోబల్ మార్కెట్లలో మంచి కొనుగోళ్ల వాతావరణానికి దారితీశాయి.
* US–China ట్రేడ్ టెన్షన్ తగ్గడం, విదేశీ పెట్టుబడుల జోరు, ఇండియాలో పండగ సీజన్ సేల్స్, ప్రైవేట్ సెక్టార్ క్యాపిటల్ ఖర్చుల పెంపు వంటివి పాజిటివ్ మూడ్ కలిగించాయి మార్కెట్లో.
* అలాగే షార్ట్ కవరింగ్ వలన సడెన్ ర్యాలీ చూసాయి మార్కెట్లు ఇవాళ.


