Monday, February 16, 2026
HomeTop StoriesSensex Nifty: బడ్జెట్ ముందు మార్కెట్స్ క్రాష్.. ముంచేసిన ఐటీ, మెటల్ స్టాక్స్..

Sensex Nifty: బడ్జెట్ ముందు మార్కెట్స్ క్రాష్.. ముంచేసిన ఐటీ, మెటల్ స్టాక్స్..

Markets Fall: గత మూడు రోజులుగా వరుస లాభాలతో దూసుకుపోయిన భారత స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఒక్కసారిగా కుప్పకూలాయి. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో.. సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాల దిశగా పయనిస్తున్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్ 619.06 పాయింట్లు పతనమై 81,947.31 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 171.35 పాయింట్లు కోల్పోయి 25,247.55 వద్ద ట్రేడ్ అయింది. ప్రధానంగా ఐటీ, మెటల్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

- Advertisement -

మార్కెట్ పతనానికి ప్రధాన కారణం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బడ్జెట్ ముందస్తు జాగ్రత్తగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, విదేశీ నిధుల వెల్లువ తగ్గడం వంటి అంశాలు మార్కెట్‌ను ఒత్తిడికి గురిచేశాయి. సెన్సెక్స్-30 కంపెనీలలో టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు మారుతీ సుజుకీ, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ వంటి షేర్లు మాత్రం కొంతమేర లాభాలతో ముందుకు సాగుతున్నాయి.

also read Cyber : ఖాతాలో కాసులు.. కేటుగాళ్ల కన్ను! మీ బ్యాంక్ బ్యాలెన్స్ కేటుగాళ్లకు ఎలా తెలుస్తోంది?

అంతర్జాతీయ పరిణామాలు కూడా భారతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ సుంకాల విధింపు హెచ్చరికలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యాన్ని కలవరపెడుతున్నాయి. దీనికి తోడు బ్రెంట్ క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 70 డాలర్ల సమీపానికి చేరుకోవడం భారత ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారింది. చమురు ధరల పెరుగుదల వల్ల ముడిసరుకుగా చమురును ఉపయోగించే పరిశ్రమలపై ఖర్చుల భారం పెరిగే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే శుక్రవారం క్రూడ్ ధరలు స్వల్పంగా 1.39 శాతం తగ్గి 69.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ఇన్ని ప్రతికూలతల మధ్య భారత ఆర్థిక సర్వే 2024-25 సానుకూల ఆశలను రేకెత్తిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.8 నుంచి 7.2 శాతంగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని సర్వే స్పష్టం చేయడం మార్కెట్‌కు కొంత ఊరటనిచ్చే అంశం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిన్న 393.97 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం 2,638.76 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసి మార్కెట్‌కు అండగా నిలబడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News