Wednesday, February 18, 2026
Homeబిజినెస్Markets Gain: బడ్జెట్ సెల్లాఫ్ నుంచి తేరుకున్న మార్కెట్లు.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

Markets Gain: బడ్జెట్ సెల్లాఫ్ నుంచి తేరుకున్న మార్కెట్లు.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

Sensex Nifty: బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనలతో పూర్తిగా నిరాశకు గురైన దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీనికి తోడు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ పెంచటంతో ఎఫ్ అండ్ ఓ మార్కెట్లలోని ఇన్వెస్టర్లు తీవ్రంగా స్పందించారు. అయితే సోమవారం రోజున మార్కెట్లు బడ్జెట్ స్పెషన్ డే ట్రేడింగ్ నష్టాల నుంచి తేరుకుని లాభాల్లోకి వచ్చాయి.

- Advertisement -

మధ్యాహ్నం 12.24 గంటల సమయంలో సెన్సెక్స్ 370 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 190 ప్లస్ పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 500 పాయింట్ల కంటే ఎక్కువ నష్టంతో ముందుకు సాగుతోంది. ప్రధానంగా ఇవాళ మార్కెట్లలో అదానీ పోర్ట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి.

also read Harish Rao: ఫోన్ ట్యాపింగ్ అంశంపై సజ్జనార్ ట్వీట్‍.. ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్ రావు!

బడ్జెట్ తర్వాత రోజున నష్టాల నుంచి తేరుకుని మార్కెట్లు ముందుకు సాగటానికి కీలక కారణాలను గమనిస్తే ముందుగా ఇన్వెస్టర్ల నుంచి వ్యాల్యూ కొనుగోళ్లు పెరగటం కనిపించిందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మార్కెట్లకు సపోర్ట్ ఇచ్చిన మరో అంశం క్రూడ్ ఆయిల్ రేట్ల పతనం, బ్రెంట్ క్రూడ్ ధర 4 శాతానికి పైగా తగ్గటంతో దేశీయ ఇన్వెస్టర్లు పాజిటివ్ గా ప్రేరేపితం అయ్యారు. అలాగే బడ్జెట్లో డేటా సెంటర్లు, వ్యవసాయం, టూరిజం వంటి రంగాలకు అందిన ప్రాధాన్యత ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను బలపరిచింది.

ఇక మార్కెట్ల పెరుగుదలకు రూపాయి రేటు పెరుగుదల కూడా అండగా నిలిచిందని చెప్పుకోవచ్చు. సోమవారం ట్రేడింగ్ సెషన్లో రూపాయి విలువ డాలర్ తో పోల్చితే 37 పైసలు బలపడి మారకపు విలువ 91.56కి చేరుకోవటం ఒక శుభపరిణామంగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News