Homeబిజినెస్Indigo: ఇండిగో బంపరాఫర్‌ ...20 వేల ఉచిత టికెట్లు

Indigo: ఇండిగో బంపరాఫర్‌ …20 వేల ఉచిత టికెట్లు

IndiGo Anniversary Offer: దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో 20వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రయాణికులకు అదిరిపోయే కానుకను బహుమతిగా ప్రకటించింది. హ్యాపీ ఇండిగో డే పేరిట ఓ ప్రత్యేక ప్రమోషనల్ క్యాంపెయిన్‌ ను ప్రయాణికుల ముందుకు తీసుకుని వచ్చింది.ఈ ఆఫర్‌ ద్వారా కేవలం మూడు రోజుల వ్యవధిలో 20000 ఉచిత విమాన టికెట్లను అందించాలని నిర్ణయించింది.

- Advertisement -

ఎంపికైన లక్కీ విజేతలకు ఒక్కో పీఎన్‌ఆర్‌ పై గరిష్ఠంగా రూ.10,000 వరకు టికెట్‌ మొత్తాన్ని నేరుగా రీఫండ్‌ చేయనున్నారు.

ఈ సువర్ణ అవకాశం ఆగస్ట్‌ 4 నుంచి ఆగస్ట్ 6 వరకు చేసే బుకింగ్‌ లకు మాత్రమే వర్తిస్తుంది. అంతేకాకుండా ఇండిగో అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా Skai ప్లాట్‌ఫామ్ ద్వారా దేశీయ విమాన టికెట్లు బుక్ చేసిన ప్రయాణికులు మాత్రమే ఈ క్యాంపెయిన్‌కు అర్హులుగా ఉంటారు. ఎకానమీ , స్ట్రెచ్ క్లాసుల్లో వన్‌వే, రౌండ్ ట్రిప్, కనెక్టింగ్ , మల్టీసిటీ బుకింగ్‌లకు ఈ అవకాశం కల్పిస్తున్నారు.

అయితే అంతర్జాతీయ విమాన బుకింగ్స్, కోడ్‌షేర్ విమానాలు, ట్రావెల్ ఏజెంట్లు లేదా ఇతర థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసే బుకింగ్స్‌కు ఈ ఆఫర్ వర్తించదు. అలాగే ఒక మొబైల్ నంబర్ లేదా ఇ-మెయిల్ ఐడీపై ఒకసారి మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుంది.ఈ క్యాంపెయిన్‌లో ర్యాండమ్ కంప్యూటర్ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు.

ఈ-మెయిల్ లేదా వాట్సాప్‌కు…

ఎంపికైన అభ్యర్థుల రిజిస్టర్డ్ ఈ-మెయిల్ లేదా వాట్సాప్‌కు ఇండిగో సంస్థకు సంబంధించిన ఒక ప్రశ్నను పంపుతారు. ఆ ప్రశ్నకు 48 గంటల్లోగా సరైన సమాధానం పంపాల్సి ఉంటుంది. దీనికోసం గరిష్ఠంగా 3 అవకాశాలు ఇస్తారు. సరైన సమాధానం చెప్పిన విజేతలకు వారు బుక్ చేసిన టికెట్ ఎయిర్‌ఫేర్‌తో పాటు పన్నులు కలిపి గరిష్ఠంగా రూ. 10,000 వరకు రీఫండ్ ఇస్తారు. ఈ మొత్తం వారు చెల్లించిన ఒరిజినల్ పేమెంట్ మోడ్‌కే 3 నుంచి 5 రోజుల్లో తిరిగి జమ అవుతుంది.

ఈ మూడు రోజుల ఆఫర్ పీరియడ్‌లో మొత్తంగా 20 వేల మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. ఆఫర్ తొలిరోజైన ఆగస్ట్ 4న ఏకంగా 10,000 మంది విజేతలను ఎంపిక చేయనుండగా, రెండు , మూడో రోజుల్లో రోజుకు 5,000 మంది చొప్పున ఎంపిక చేస్తారు. ముందస్తుగా లక్కీ డ్రాలో ఎంపికై, ఆ తర్వాత ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం ద్వారా ఈ ఉచిత టికెట్ పొందవచ్చు.

Also Read:  Crop Holiday: క్రాప్‌ హాలీడే ప్రకటించిన కోనసీమ రైతులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News