Indigo special scheme Travel with less baggage more benefits: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. తక్కువ లగేజీతో ప్రయాణించేవారికి తక్కువ ఛార్జీతో విమానంలో ప్రయాణించేలా ‘ఇండిగో లైట్’ పేరుతో ప్రత్యేక ఛార్జీల విధానాన్ని తీసుకొచ్చింది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు సైతం ఈ విధానం వర్తిస్తుంది. అయితే, డైరెక్ట్ ఫ్లైట్లలో మాత్రమే దీన్ని అనుమతిస్తారు. ఇందులో సాధారణ ఎకానమీ టికెట్లతో పోలిస్తే టికెట్ ధరలు తక్కువగా ఉంటాయి.
Also read: Vodafone Idea: వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్.. తక్కువ రీఛార్జ్‌కే ఎక్కువ బెనిఫిట్స్..!
తక్కువ ధరలోనే విమాన ప్రయాణం..
అయితే, ఇండిగో లైట్ కింద కేవలం 7 కేజీల వరకు క్యాబిన్ బ్యాగ్‌ను మాత్రమే అనుమతిస్తారు. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా లగేజీ పెట్టుకునే ఆటోమెటిక్ సీటును కేటాయిస్తారు. తక్కువ లగేజీతో ప్రయాణించేవారు పొందుతున్న సేవలకు మాత్రమే చెల్లించేలా ఈ టికెట్ విధానాన్ని డిజైన్ చేసినట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. విమాన ప్రయాణాన్ని మరింత ఎక్కువ మందికి, తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇండిగో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ అలోక్ సింగ్ తెలిపారు. ఇండిగో యాప్, వెబ్‌సైట్‌లో బుకింగ్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎయిరిండియా గ్రూపునకు చెందిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సైతం ‘ఎయిరిండియా లైట్’ పేరిట క్యాబిన్ బ్యాగేజీ ఓన్లీ ఫేర్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పుడు ఇదే విధానాన్ని ఇండిగో సైతం అమలు చేస్తోంది. ప్రస్తుతం, ఇండిగో 2100 విమాన సర్వీసులను నడుపుతోంది.

