Homeబిజినెస్Infosys : వెంటనే వాటి లెక్కలు చెప్పండి.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ కంపెనీ మెయిల్

Infosys : వెంటనే వాటి లెక్కలు చెప్పండి.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ కంపెనీ మెయిల్

Employees : సాధారణంగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను “ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది?” అని అడుగుతుంటాయి. కానీ, ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాత్రం ఇప్పుడు రూటు మార్చింది. “మీ ఇంట్లో ఎన్ని బల్బులు ఉన్నాయి? ఏసీ వాడుతున్నారా? అసలు మీ ఇంటి కరెంటు బిల్లు ఎంత వస్తోంది?” అంటూ ఆసక్తికరమైన ప్రశ్నలతో ఉద్యోగుల ముందుకు వచ్చింది. ఈ వినూత్న సర్వే ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -

ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటోందని అనుకుంటే పొరపాటే! దీని వెనుక ఒక గొప్ప ఆశయం ఉంది. అదే ‘కార్బన్ తటస్థత’ (Carbon Neutrality). కంపెనీ కార్యాలయాల్లో విద్యుత్ వాడకం ఎంత అనేది మేనేజ్‌మెంట్ దగ్గర లెక్కలు ఉంటాయి. కానీ, ప్రస్తుతం హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులు నెలలో చాలా రోజులు ఇంటి నుండే పని చేస్తున్నారు (WFO). మరి ఇంటి దగ్గర పని చేస్తున్నప్పుడు వాడే విద్యుత్ వల్ల వెలువడే కర్బన ఉద్గారాల మాటేమిటి? ఈ లెక్కలను కూడా అత్యంత ఖచ్చితంగా నమోదు చేయాలన్నదే సంస్థ ప్రధాన ఉద్దేశ్యం.

సర్వేలో అడుగుతున్న ప్రశ్నలివే..
ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో సీఎఫ్ఓ జయేష్ సంఘ్‌రాజ్‌కా పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు.ఉద్యోగులు తమ ఇంట్లో వాడే పరికరాల వివరాలను వెల్లడించాలని కోరారు.
1.మీరు ఇంట్లో ఏయే ఎలక్ట్రిక్ ఉపకరణాలు (ఫ్యాన్లు, ఏసీలు, హీటర్లు) వాడుతున్నారు?
2.మీ ఇంట్లోని లైట్ల వాటేజీ ఎంత?
3.మీరు ఏవైనా పునరుత్పాదక ఇంధన వనరులు (సోలార్ పవర్ వంటివి) వాడుతున్నారా?
4.విద్యుత్ ఆదా చేయడానికి మీ దగ్గర ఏవైనా కొత్త ఐడియాలు ఉన్నాయా?

‘ఇన్ఫీ’ ఒక ట్రెండ్ సెట్టర్
పర్యావరణ పరిరక్షణలో ఇన్ఫోసిస్ గత 15 ఏళ్లుగా అగ్రగామిగా ఉంది. ప్రపంచం నిర్దేశించుకున్న గడువు కంటే ముందే ‘కార్బన్ న్యూట్రాలిటీ’ని సాధించిన అతికొద్ది సంస్థల్లో ఇది ఒకటి.సంస్థ వాడుతున్న విద్యుత్తులో అత్యధిక భాగం సోలార్ వంటి పునరుత్పాదక ఇంధనం నుంచే వస్తోంది. కర్ణాటకలో ఇన్ఫోసిస్‌కు సొంతంగా 60 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఉంది.2008 నుంచి ఇప్పటి వరకు తలసరి విద్యుత్ వినియోగాన్ని ఇన్ఫోసిస్ 55 శాతం మేర తగ్గించింది.

పెద్ద పెద్ద కంపెనీలు తాము పర్యావరణానికి చేస్తున్న హానిని లేదా మేలును ప్రభుత్వాలకు నివేదించాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఆఫీసులో ఉంటే ఆ లెక్కలు కంపెనీ దగ్గరే ఉంటాయి. కానీ ఇంటి వద్ద పని చేస్తున్నప్పుడు వారి వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయడానికి ఈ డేటా ఎంతో కీలకం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News