Homeబిజినెస్Infosys buyback: ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్! రూ.18,000 కోట్ల షేర్ బైబ్యాక్.. ఒక్కో షేర్‌కు రూ.1,800...

Infosys buyback: ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్! రూ.18,000 కోట్ల షేర్ బైబ్యాక్.. ఒక్కో షేర్‌కు రూ.1,800 ఫిక్స్!

Infosys buyback offer: భారతదేశంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తన వాటాదారులకు ఊహించని శుభవార్త అందించింది! ఏకంగా రూ 18 వేల కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేయాలని (Share Buyback) నిర్ణయించింది. మార్కెట్లో ఇన్ఫోసిస్ షేర్లు ఉన్నవారికి ఇది నిజంగా పండగ లాంటి వార్తే.

- Advertisement -

రూ.1,800 ధరకు షేర్ బైబ్యాక్!
మీకు ఇన్ఫోసిస్ షేర్లు ఉన్నాయా? అయితే మీకోసం కంపెనీ అద్భుతమైన అవకాశం తీసుకొచ్చింది. కంపెనీ తన వాటాదారుల నుంచి ఒక్కో షేర్‌ను రూ.1,800 చొప్పున కొనుగోలు చేయనుంది. ఇది ఎంత లాభదాయకమైన ఆఫర్ అంటే, సాధారణంగా మార్కెట్లో ట్రేడ్ అయ్యే ధర కంటే ఈ బైబ్యాక్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మెగా బైబ్యాక్ ప్రక్రియకు వాటాదారుల ఆమోదం నవంబర్ 6నే లభించింది. ఈ ప్రక్రియ నవంబర్ 20న మొదలై, నవంబర్ 26 వరకు కొనసాగుతుంది. బైబ్యాక్‌లో కంపెనీ మొత్తం 10 కోట్ల పెయిడ్‌-అప్‌ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనుంది.

బైబ్యాక్ అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు?
సాధారణంగా, బైబ్యాక్ అంటే ఒక కంపెనీ తన సొంత షేర్లను మార్కెట్ నుంచి తిరిగి కొనుక్కోవడం. దీనిని ‘టెండర్ ఆఫర్’ పద్ధతి ద్వారా, అంటే అందరి నుంచీ దామాషా పద్ధతిలో (Proportionate Basis) కొనుగోలు చేస్తారు. కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం… మిగిలిన షేర్ల విలువను పెంచడం! బైబ్యాక్ ద్వారా మార్కెట్లో షేర్ల సంఖ్య తగ్గుతుంది. డిమాండ్ పెరిగి, మిగిలిన షేర్ల విలువ పెరుగుతుంది. ఇది కంపెనీపై పెట్టుబడి పెట్టిన వారికి మరింత లాభాన్ని తెస్తుంది. అయితే నవంబర్ 14 నాటికి కంపెనీ షేర్లు ఉన్న వాటాదారులు మాత్రమే ఈ బైబ్యాక్‌లో పాల్గొనేందుకు అర్హులు. మీ షేర్లను అధిక ధరకు అమ్ముకోవడానికి ఇదే సరైన సమయం! ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News