insta360 : చైనాకు చెందిన టెక్ కంపెనీ ఇన్‌స్టా360 తమ ఉద్యోగుల ఆరోగ్యం కోసం వినూత్నమైన “మిలియన్ యువాన్ వెయిట్ లాస్ ఛాలెంజ్”ని ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఛాలెంజ్‌లో ఉద్యోగులు బరువు తగ్గితే భారీ నగదు బహుమతులు పొందొచ్చు. ప్రతి అర కిలో బరువు తగ్గితే 500 యువాన్లు (సుమారు రూ.6,100) బోనస్‌గా ఇస్తారు. మొత్తం బహుమతి విలువ రూ.1.23 కోట్లకు పైగా!
ALSO READ: Salman Khan : సల్మాన్ ఖాన్ ఒక రౌడీ – ‘దబాంగ్’ డైరెక్టర్ తీవ్ర ఆరోపణలు!
ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి ప్రారంభమైన ఈ పోటీలో క్సీ యాఖీ అనే ఉద్యోగి 90 రోజుల్లో 20 కిలోలు తగ్గి రూ.2.47 లక్షల బోనస్ గెలుచుకుంది. క్రమశిక్షణతో కూడిన ఆహారం, రోజుకు గంటన్నర వ్యాయామం ఆమె విజయ రహస్యం. “ఇది కేవలం బరువు తగ్గడం కోసం కాదు, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం” అని ఆమె చెప్పింది.
అయితే, ఈ ఛాలెంజ్‌లో ఓ ట్విస్ట్ కూడా ఉంది! బరువు తగ్గిన తర్వాత తిరిగి పెరిగితే, ప్రతి అర కిలోకు రూ.9,800 జరిమానా చెల్లించాలి. అయినప్పటికీ, ఇప్పటివరకు ఎవరికీ జరిమానా విధించలేదని కంపెనీ తెలిపింది. 2022 నుంచి ఈ పోటీని ఏడుసార్లు నిర్వహించగా, రూ.2.47 కోట్ల విలువైన బహుమతులు పంపిణీ చేశారు. గత ఏడాది 99 మంది ఉద్యోగులు కలిసి 950 కిలోల బరువు తగ్గారు!
ఇన్‌స్టా360 ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగుల్లో ఆరోగ్య జీవనశైలిని ప్రోత్సహిస్తోంది. “మా ఉద్యోగులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటున్నాం” అని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. చైనా ప్రభుత్వం 2024లో ప్రారంభించిన “వెయిట్ మేనేజ్‌మెంట్ ఇయర్” కార్యక్రమంతో ఈ ఛాలెంజ్ మరింత ప్రాచుర్యం పొందింది. ఈ వినూత్న ఆలోచన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించేందుకు ఇన్‌స్టా360 చేస్తున్న కృషి అభినందనీయం!


