iQOO Z10R 5G: iQOO Z10R 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు భారత దేశంలో లాంచ్ చేసారు. ఈ స్మార్ట్ మొబైల్ 17.19 సెంటీమీటర్ల (6.77 అంగుళాలు) డిస్ ప్లే కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తో తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీనికి రెండు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది. ఇది కర్వ్డ్ డిస్‌ప్లే, 50ఎంపీ ప్రధాన కెమెరా, డ్యూయల్ ఐపీ రేటింగ్‌లతో ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 15తో ఈ డివైస్ పనిచేస్తుంది.
మొబైల్ వెనుక వైపు 50 ఎంపీ సోనీ కెమెరా, 2 ఎంపీ బొకే షూటర్ ఉంది. ముందువైపు 32 ఎంపీ కెమెరా ఇచ్చారు. ఇందులో నైట్, పోట్రైట్, ఫోటో, వీడియో, మైక్రో-మూవీ, 50ఎంపీ, పానో, అల్ట్రా హెచ్డీ డాక్యుమెంట్, స్లో మోషన్, టైం-ల్యాప్స్, సూపర్ మూన్, ప్రో మోడ్, ఫుడ్, డ్యూయల్ వ్యూ, లైవ్ ఫోటో, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మోడ్స్ ఉన్నాయి.
Readmore: https://teluguprabha.net/business/how-many-people-can-travel-in-a-railway-general-coach/
iQOO Z10Rలోని వర్చువల్ మెమోరీ ఫీచర్‌ని ఉపయోగించి RAMని మరో 12జీబీ వరకు విస్తరించవచ్చు. ఇందులో 5,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉన్నాయి. డిస్ ప్లే కోసం, ఇది 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇచ్చే క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇందులో అమెజాన్, ఫేస్ బుక్, లింక్డ్ ఇన్, స్నాప్ చాట్, నెట్ ఫ్లిక్స్, ఫోన్ పే ఆప్ లను ప్రీ ఇన్స్టాల్ చేసారు. గూగుల్ సర్వీసెస్ ని కూడా ఆడ్ చేసారు.
ఈ మొబైల్ ప్రస్తుతం మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.19,499, 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.21,499, 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధరను రూ.23,499గా నిర్ణయించారు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై ధర తగ్గింపు ఉంటుంది. ఈ నెల 29నుండి విక్రయదారులకు అందుబాటులో ఉంటుంది.


