IRCTC Special Offer For Dubai Tour Here the Details: టూరిజం సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐఆర్‌సీటీసీ దుబాయ్ టూర్ ప్రకటించింది. “ది స్ప్లెండర్స్ ఆఫ్ దుబాయ్” పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. కాగా, ఈ టూర్ రాబోయే జనవరి నెలలో ప్రారంభం కానుంది. 23 నుంచి 27 వరకు కొనసాగుతుంది. నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు సాగే ఈ విహార యాత్ర కోసం హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరుతారు. మరి, ఈ ప్యాకేజీలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఏయే ప్రాంతాలను సందర్శిస్తారు? టికెట్ ధర ఎంత? వంటి వివరాలు తెలుసుకుందాం.
మొదటి రోజు
జనవరి 23న ఉదయం 10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ ఫ్లైట్ బయల్దేరుతుంది. రెండున్నర గంటల్లో దుబాయ్ చేరుకుంటుంది. అక్కడి నుంచి ముందుగానే బుక్ చేసిన హోటల్‌లోకి తీసుకెళ్తారు. అక్కడ లంచ్ చేసి రెస్ట్ తీసుకుంటారు. సాయంత్రం దుబాయి మెరీనాలోని ధో క్రూయిజ్ సందర్శిస్తారు. రాత్రికి అదే హోటల్ లో బస ఉంటుంది.
రెండో రోజు
రెండో రోజు ఉదయం రెడీ అయిన తర్వాత వీల్ ఐన్ దుబాయ్‌తో పాటు నగరాన్ని సందర్శిస్తారు. ఇండియన్ రెస్టారెంట్‌లో లంచ్ పూర్తి చేస్తారు. ఆ తర్వాత “డిజర్ట్ సఫారీ”ని ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం తిరిగి హోటల్‌కు చేరుకొని బస చేయవచ్చు.
మూడో రోజు
మూడో రోజు ఉదయం గ్లోబల్ విలేజ్‌ను చూడడానికి బయల్దేరుతారు. తర్వాత మిరాకిల్ గార్డెన్ కూడా సందర్శిస్తారు. ఆ తర్వాత ప్రతిష్టాత్మక బుర్జ్ ఖలీఫాని సందర్శిస్తారు. ఆ తర్వాత రాత్రికి లైట్ షోను వీక్షిస్తారు. డిన్నర్ కూడా అక్కడే కంప్లీట్ చేసుకొని హోటల్‌కు బయల్దేరి వెళ్తారు.
నాలుగో రోజు
నాలుగో రోజు ఉదయాన్నే బయల్దేరి అబుదాబి చేరుకుంటారు. ఫస్ట్ హిందూ టెంపుల్ “బాప్స్”ను దర్శించుకుంటారు. ఆ తర్వాత ఇండియన్ రెస్టారెంట్‌లో లంచ్ చేస్తారు. అనంతరం షక్ జాయెద్ మసీదు, ఫెర్రారీ వరల్డ్ ఫొటోషూట్ కూడా సందర్శిస్తారు. అనంతరం అక్కడే డిన్నర్ చేసి హోటల్‌కు చేరుకుంటారు.
ఐదో రోజు
చివరి రోజు ఉదయం హోటల్ నుంచి చెక్ ఔట్ చేస్తారు. దారిలో “దుబాయ్ ఫ్రేమ్” చూస్తారు. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత షాపింగ్ చేసుకోవచ్చు. సాయంత్రం 6.30 గంటల్లోపు ఎయిర్ పోర్టుకు చేరుకోవాల్సి ఉంటుంది. రాత్రి 9.30కు ఫ్లైట్ బయల్దేరుతుంది.
టికెట్ ధర ఎంతంటే?
దుబాయ్ టూర్‌కు టికెట్ ధర కనీసం రూ.1,12,000 నుంచి ప్రారంభమవుతుంది. సౌకర్యాలను బట్టి ధరలో మార్పులు చేర్పులు ఉంటాయి. అయితే, ఈ టూర్‌కు వెళ్లేవారికి తప్పనిసరిగా పాస్‌పోర్ట్ ఉండాలి. వీసా కోసం కొన్ని ధ్రువీకరణ పత్రాలు కూడా అవసరం. ఈ ప్యాకేజీలో హోటల్స్, భోజనాలు, ఎంట్రీ టికెట్స్, స్థానిక గైడ్ ఖర్చులు కవర్ అవుతాయి. వీటికి అదనంగా చేసే ఖర్చులు ఏవైనా సొంతంగా భరించాల్సి ఉంటుంది.


