Saturday, November 15, 2025
HomeTop StoriesMarket Fall: ట్రంప్ నిర్ణయంతో మార్కెట్లు ఢీలా.. సెన్సెక్స్ నిఫ్టీలను నష్టాల్లోకి నెట్టిన ఐటీ స్టాక్స్..

Market Fall: ట్రంప్ నిర్ణయంతో మార్కెట్లు ఢీలా.. సెన్సెక్స్ నిఫ్టీలను నష్టాల్లోకి నెట్టిన ఐటీ స్టాక్స్..

IT Stocks Dragging: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు ప్రపంచ వ్యాప్తంగా యూఎస్ పేరును మసకబారుస్తోంది. ప్రస్తుతం ఉన్న తరుణంలో అమెరికా నమ్మదగిన వాణిజ్య మిత్రదేశం కాదనే భావన చాలా దేశాల్లో పెరిగిపోతోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్1బి వీసాల అప్లికెంట్లకు లక్ష డాలర్ల వన్ టైమ్ రుసుమును ఫీజుగా చెల్లించాలని చెప్పటం అందరినీ షాక్ కి గురిచేసింది. అమెరికా వెళ్లి జాబ్ కొట్టాలి సెటిల్ అవ్వాలి అక్కడే అని కలలు కంటున్న వేల మంది భారతీయులకు ట్రంప్ నిర్ణయం నిద్రలేకుండా చేస్తోంది.

- Advertisement -

సోమవారం భారత స్టాక్ మార్కెట్లు ఊహించిన విధంగానే ట్రంప్ హెచ్1బి వీసా కొత్త రూల్స్ ప్రభావంతో నష్టాల్లోనే ట్రేడింగ్ స్టార్ట్ చేశాయి. ప్రధాన బెంచ్ మార్క్ సూచీల పనితీరును పరిశీలిస్తే.. సెన్సెక్స్ 90 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. నిఫ్టీ సూచీ స్వల్పంగా 10 పాయింట్ల లాస్ లో ఉంది. ప్రధానంగా ఐటీ రంగానికి చెందిన స్టాక్స్ మార్కెట్లను నష్టాల్లోకి లాగుతుండగా.. పవర్ స్టాక్స్ మాత్రం టాప్ గెయినర్లుగా దూకుడును కొనసాగిస్తున్నాయి.

ఈ క్రమంలో టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ టాప్ లూజర్ల కేటగిరీలో నిఫ్టీలో కొనసాగుతున్నాయి. అలాగే ఐటీ సూటీ కూడా 2 శాతానికిపైగా ఇంట్రాడేలో నష్టపోవటం పెరుగుతున్న ఆందోళనలను సూచిస్తోంది.

భారత ఐటీ రంగానికి ఉన్న ముప్పులు..
అమెరికా కేవలం కొత్త హెచ్1బి వీసా అప్లికెంట్లకు మాత్రమే పెంచిన లక్ష డాలర్ల రుసుము అని ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లు, రెన్యూవల్ చేసుకోవాలనుకునే వారికి, సెలవుపై తమ దేశానికి వెళ్లిన వారికి కొత్త రూల్ వర్తించదని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉపశమనాన్ని పక్కనపెడితే.. కనీత వేతనాల పెంపు, ఔట్ సోర్సింగ్ పై పన్నులు వంటి చర్యలు భారత ఐటీ కంపెనీల ఆదాయాలకు గండికొట్టేవిగా ఉన్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. మెుత్తానికి ట్రంప్ అధికారంలో ఉన్నన్నాళ్లు ఈ అనిశ్చితులు కొనసాగుతాయనే క్లారిటీ మాత్రం టెక్ కంపెనీలకు వస్తోంది. కరోనా నుంచి మెల్లగా కోలుకున్న తర్వాత కంపెనీలకు గడ్డు పరిస్థితులు అమెరికా, యూరోపియన్ మార్కెట్ల నుంచి పెరకటం వ్యాపారాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతోందని తెలుస్తోంది. మరోపక్క ఏఐ వినియోగం టెక్కీలను అస్సలు ఊపిరి పీల్చుకోనివ్వటం లేదు. దీంతో జాబ్ సెక్యూరిటీ అనే పదం కనుమరుగైపోతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad