Jio unlimited offer 2025: టెలికాం రంగంలో తనదైన ముద్ర వేసుకున్న రిలయన్స్ జియో… ఇప్పుడు మరోసారి తమ కస్టమర్ల కోసం ఓ అదిరిపోయే శుభవార్తను ప్రకటించింది. తన అద్భుతమైన త్రైమాసిక ఫలితాల ఉత్సాహంతో, వినియోగదారులకు ధన్యవాదాలు తెలిపేలా, జియో సరికొత్త ‘అన్‌లిమిటెడ్ ఆఫర్ 2025’ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా ఏకంగా 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, 50 రోజుల పాటు జియోఫైబర్ లేదా జియోఎయిర్‌ఫైబర్ సేవలను ఉచితంగా అందిస్తోంది. కళ్లు చెదిరే ఈ ఆఫర్లతో జియో తన వినియోగదారులను ఆనందంలో ముంచెత్తుతోంది.
క్వార్టర్లీ ఫలితాల జోష్.. కస్టమర్లకు గిఫ్ట్:
2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో (Q1 FY26) జియో ప్లాట్‌ఫారమ్స్ అద్భుతమైన ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ కాలంలో కంపెనీ ఏకంగా రూ.7,110 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది, ఇది గత ఏడాదితో పోలిస్తే 24.8 శాతం అధికం. ఇదే ఉత్సాహంతో, తమ విజయంలో కీలక పాత్ర పోషించిన 49.8 కోట్ల మంది వినియోగదారులకు బహుమతిగా ఈ కొత్త ఆఫర్లను ప్రకటించింది. ఈ త్రైమాసికంలోనే కంపెనీ 99 లక్షల మంది కొత్త చందాదారులను చేర్చుకోవడం విశేషం.
జియో ‘అన్‌లిమిటెడ్ ఆఫర్’: 90 రోజుల హాట్‌స్టార్ ఉచితం:
క్రికెట్ సీజన్‌లో వచ్చిన అద్భుత స్పందనతో, జియో తన ‘అన్‌లిమిటెడ్ ఆఫర్ 2025’ ను పొడిగించింది. దీని ద్వారా అర్హులైన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ సేవలను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా పొందవచ్చు. మొబైల్, టీవీలలో 4K నాణ్యతతో కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు.
ప్రీపెయిడ్: రూ. 349 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్లాన్‌లతో (రోజుకు 1.5GB లేదా అంతకంటే ఎక్కువ డేటా అందించేవి) రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు.
పోస్ట్‌పెయిడ్: నెలసరి అద్దె రూ. 349 లేదా ఆపై ఉన్న ప్లాన్‌లను కలిగిన వినియోగదారులు.
జియోభారత్, జియోఫోన్, వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను వినియోగించే వారికి ఈ ఆఫర్ వర్తించదు.
50 రోజుల ఉచిత ఫైబర్/ఎయిర్‌ఫైబర్ ట్రయల్:
ఇంట్లో సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్ కావాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం. జియో ఇప్పుడు కొత్తగా 50 రోజుల ఉచిత జియోఫైబర్ లేదా జియోఎయిర్‌ఫైబర్ ట్రయల్‌ను అందిస్తోంది.దీనికోసం రూ. 349 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ ఉన్న ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఈ ట్రయల్‌కు అర్హులు. ఈ ఆఫర్‌ను పొందడానికి కస్టమర్లు రూ. 500 రీఫండబుల్ డిపాజిట్ చెల్లించవలసి ఉంటుంది. ఈ మొత్తాన్ని 6 నెలల తర్వాత ఐదు రూ. 100 వోచర్‌ల రూపంలో తిరిగి పొందవచ్చు.
ఈ ఆఫర్లను పొందడం ఎలా : ఈ ఆఫర్లను పొందడం చాలా సులభం. ఆసక్తి ఉన్న కస్టమర్లు MyJio యాప్ లేదా Jio.com వెబ్‌సైట్‌ను సందర్శించి, తమ అర్హతను తనిఖీ చేసుకుని, ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ జూలై 1, 2025 నుండి ప్రారంభమైంది. పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని జియో స్పష్టం చేసింది.
గమనిక: ట్రయల్ పీరియడ్ ముగిసిన తర్వాత, వినియోగదారులు స్వయంచాలకంగా నెలకు రూ. 599 విలువైన జియోఫైబర్ లేదా ఎయిర్‌ఫైబర్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కు మార్చబడతారు.


