JIO Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ చరిత్ర సృష్టించింది. కోటి దరఖాస్తులు దాటిన తొలి ఐపీఓగా రికార్డు సాధించింది. కాగా, ఇంకా దరఖాస్తుల వెల్లువ కొనసాగుతుండగా.. ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు బిడ్డింగ్ తెరిచి ఉంటుంది.
‘సంపద సృష్టిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, లక్షలాది మంది భారతీయ పెట్టుబడిదారులకు సాధికారత కల్పించడం ‘అనే ధీరూభాయ్ అంబానీ వారసత్వాన్ని, ముఖేష్ అంబానీ దార్శనికతను ముందుకు తీసుకువెళ్తూ, అపూర్వమైన పెట్టుబడిదారుల భాగస్వామ్యం ఒక కొత్త ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పింది.
చరిత్రాత్మక మైలురాయి
ఇష్యూ ముగియడానికి ఇంకా ఐదు గంటల సమయం ఉండగానే, జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ కోటి దరఖాస్తులను దాటింది. వారీ ఎనర్జీస్ ఐపీఓకు వచ్చిన సుమారు 97 లక్షల దరఖాస్తుల మునుపటి ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, బీసీసీఎల్ ఐపీఓలు సుమారు 90 లక్షల దరఖాస్తులతో భారతదేశంలో గతంలో రికార్డులు సృష్టించాయి.
అపూర్వమైన పెట్టుబడిదారుల భాగస్వామ్యం
జియో ప్లాట్‌ఫామ్స్‌పై పెట్టుబడిదారులకు ఉన్న బలమైన ఆసక్తిని ప్రతిబింబిస్తూ, ప్రపంచవ్యాప్తంగా కోటి దరఖాస్తుల మార్కును దాటిన తొలి ఐపీఓగా నిలిచింది. బిడ్డింగ్ కొనసాగుతూనే ఉండటంతో.. తుది దరఖాస్తుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా మరింత ఉన్నతమైన ప్రమాణాన్ని నెలకొల్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

