Sunday, July 13, 2025
Homeబిజినెస్July Bank Holidays: జులైలో 13 రోజులు బ్యాంకులు మూత

July Bank Holidays: జులైలో 13 రోజులు బ్యాంకులు మూత

July 2025 Bank Holidays : జూలై 2025లో దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మొత్తం 13 రోజులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం, ఆయా ప్రాంతాల్లో జరిగే పండుగలు, ప్రత్యేక సందర్భాల ఆధారంగా ఈ సెలవులు ఉంటాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రానికి రాష్ట్రానికి వేర్వేరుగా ఉంటాయనే విషయం గమనించాలి.

- Advertisement -

జూలై 3న త్రిపురాలో ఖర్చీ పూజ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. జూలై 5న జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో గురు హర్‌గోబింద్ జీ జయంతి సందర్భంగా బ్యాంకులు మూసివేస్తారు, ఇక జూలై 14న మేఘాలయలోని షిల్లాంగ్‌లో ప్రసిద్ధి గాంచిన బెహ్ డియెన్‌ఖ్లమ్ పండుగ సందర్భంగా బ్యాంకులు మూతపడతాయి. జూలై 16న ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో వర్షాకాలం ఆరంభాన్ని సూచించే హరేలా పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. మళ్లీ షిల్లాంగ్‌లోనే జూలై 17న స్వాతంత్ర్య సమరయోధుడు యు టిరోట్ సింగ్ వర్ధంతి కారణంగా బ్యాంకులు పనిచేయవు. త్రిపురాలోనే జూలై 19న మరోసారి కెర్ పూజ కారణంగా బ్యాంకులు మూతపడతాయి. సిక్కింలోని గాంగ్‌టక్‌లో బౌద్ధ పండుగ అయిన ద్రుక్పా త్షే-జి సందర్భంగా జూలై 28న బ్యాంకులు మూసివేయబడతాయి.

ఈ ప్రాంతీయ సెలవులతో పాటు, భారతదేశంలోని అన్ని షెడ్యూల్డ్ మరియు నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు నెలలో రెండో శనివారం అయిన జూలై 12న మరియు నాలుగో శనివారం అయిన జూలై 26న మూసివేయబడతాయి. అదేవిధంగా జూలై 6, 13, 20, 27 తేదీల్లో ఆదివారాలు ఉన్నందున దేశవ్యాప్తంగా బ్యాంకులు అందుబాటులో ఉండవు.

బ్యాంకు బ్రాంచ్‌లు మూసివుండే రోజుల్లోనూ కస్టమర్లు ఎప్పటిలాగే మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATMల ద్వారా తమ లావాదేవీలను కొనసాగించవచ్చు. అయితే, చెక్కు క్లియరెన్స్, RTGS, NEFT వంటి సేవలు ఆలస్యం కావొచ్చునన్న విషయం వినియోగదారులు గమనించాలి. వ్యక్తిగతంగా బ్యాంక్ పనులు చేయాల్సినవారు ఆయా రాష్ట్రాల్లో సెలవులకు ముందు తమ అవసరాలను ముగించుకోవాలని సూచించడమైనది.

మొత్తంగా త్రిపురాలో జూలై 3, 19న బ్యాంకులు మూతపడతాయి. జమ్మూ & కాశ్మీర్‌లో జూలై 5న, మేఘాలయలో జూలై 14 మరియు 17న, ఉత్తరాఖండ్‌లో జూలై 16న, సిక్కింలో జూలై 28న బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వీటితో పాటు జూలై 12, 26 తేదీలలో శనివారం మరియు జూలై 6, 13, 20, 27 తేదీల్లో ఆదివారాల కారణంగా బ్యాంకులు మూసి ఉంటాయి.

రాష్ట్రాల వారీగా బ్యాంక్ సెలవుల జాబితా – జూలై 2025

త్రిపుర:

  • జులై 3 (గురువారం) – ఖర్చీ పూజ
  • జులై 19 (శనివారం) – కెర్ పూజ

జమ్ము & కాశ్మీర్:

జులై 5 (శనివారం) – గురు హర్‌గోబింద్ జీ జయంతి

మేఘాలయ:

  • జులై 14 (సోమవారం) – బెహ్ డియెన్‌ఖ్లమ్
  • జులై 17 (గురువారం) – యు టిరోట్ సింగ్ వర్ధంతి

ఉత్తరాఖండ్:

  • జులై 16 (బుధవారం) – హరేలా

సిక్కిం:

  • జులై 28 (సోమవారం) – ద్రుక్పా త్షే-జి

దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవులు:

  • జులై 12 (రెండో శనివారం)
  • జులై 26 (నాలుగో శనివారం)
  • అన్ని ఆదివారాలు – జులై 6, 13, 20, 27
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News