Kinetic Green E-Luna Prime Launched:ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఈ పెరుగుతున్న డిమాండ్‌కు ప్రతిస్పందనగా తయారీదారులు వివిధ విభాగాలలో కొత్త వాహనాలను పరిచయం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు కైనెటిక్ కూడా E-Luna ప్రైమ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొన్ని నెలల్లోనే 25,000 యూనిట్లకు పైగా సేల్ అయినా ఈ లూనాకు అప్డేట్ వెర్షన్. ఈ బ్రాండ్ వారసత్వాన్ని మార్కెట్లో ముందుకు తీసుకెళ్లేందుకు కైనెటిక్ గ్రీన్ ఇప్పుడు ఈ లూనా ప్రైమ్ ను తీసుకొచ్చింది. తయారీదారు ఈ మోపెడ్‌ను విస్తృత శ్రేణి ఫీచర్లతో అందిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మారుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించారు.
also read:Samsung Galaxy S24 Ultra 5G: అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్.. ఎందులో చవక..?
ఫీచర్లు:
కంపెనీ దీనిలో అందించిన 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ గతుకుల రోడ్లపై కూడా అద్భుతమైన స్థిరత్వాన్ని, మన్నికను అందిస్తాయి.దీని డిజైన్, పర్ఫామెన్స్ మునుపటి ఈ-లూనా తో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంటుంది.తయారీదారు కొత్త E-Luna ప్రైమ్‌లో రెండు సీట్ల ఎంపికలను అందించారు. ఇది ఒకే ఛార్జ్‌లో 110 నుండి 140 కిలోమీటర్ల పరిధిని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. కైనెటిక్ గ్రీన్ నుండి వచ్చిన ఈ మోపెడ్ LED హెడ్‌లైట్, సింగిల్ సీటు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రిమ్ టేప్, బాడీ డెకాల్స్, ట్యూబ్‌లెస్ టైర్‌లతో సహా అనేక అద్భుతమైన ఫీచర్లను కలియు ఉంది.
ధర :
కొత్త ఇ-లూనా ప్రైమ్‌ను భారత మార్కెట్లో రూ.82,490 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేశారు. కాగా, ఇది ఆరు రంగుల ఎంపికలలో లభిస్తోంది. కస్టమర్లు తమ సమీపంలోని కైనెటిక్ గ్రీన్ డీలర్ షిప్ లలో కొనుగోలు చేయవచ్చు. ప్రత్యేక విషయం ఏంటంటే దీనికి కిలోమీటర్ కు కేవలం 10 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ విధంగా చూస్తే బైక్ రన్నింగ్ ఖర్చు నెలకు కేవలం రూ.2500 మాత్రమే అవుతుంది. ఎలక్ట్రిక్ వాహనం కేవలం ప్రాణాలకే కాకుండా చిన్న పార్టీ వ్యాపారాలు, కార్గో, ఇతర వినియోగ సేవలకు కూడా ఉపయోగపడుతుంది


