Saturday, November 15, 2025
Homeబిజినెస్GST on Bike Rates: రేట్లు తగ్గించిన టాప్ 5 టూవీలర్ కంపెనీలు.. ఏ మోడల్...

GST on Bike Rates: రేట్లు తగ్గించిన టాప్ 5 టూవీలర్ కంపెనీలు.. ఏ మోడల్ బైక్ పై ఎంతంటే..?

Bikes Rates Fall: కేంద్ర ప్రభుత్వం తాజాగా సెప్టెంబర్ 22 నుంచి దేశంలో జీఎస్టీ విధానంలో సమగ్ర సవరణలు చేపట్టింది. ఈ సంస్కరణల్లో, ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలలో రెండు చక్రాల వాహనాలపై జీఎస్టీ రేట్ల మార్పులు వచ్చాయి. ముఖ్యంగా 350 సీసీ కంటే తక్కువ కెపాసిటీలో ఉన్న స్కూటర్లు, బైక్సుల మీద జీఎస్టీకి 18% రేటు విధించాలని అధికారికంగా నిర్ణయించారు. ఇదే సమయంలో 350 సీసీకి పైగా ఉండే పెద్ద కెపాసిటి మోటార్ సైకిళ్లకు భారీగా 40% జీఎస్టీ విధించబడుతోంది.

- Advertisement -

ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల రెండు చక్రాల వాహనాల మోడళ్ల ధరల్లో భారీ తగ్గింపులు వచ్చింది. ప్రముఖ కంపెనీలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త జీఎస్టీ స్లాబ్ ప్రకారం తమ బైక్‌ల వద్ద వేల రూపాయల మేర ధరలను తగ్గిస్తూ వినియోగదారులకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జీఎస్టీ మార్పులు వినియోగదారులకు భారీ బెనిఫిట్ ఇచ్చేందుకు, దేశీయంగా వాహన విక్రయాలను మరింత పెంచేందుకు కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయం. ఇది దేశంలో ఆర్థిక విజయానికి, ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం పెరుగుదలకి మరింత తోడ్పడుతుంది. దీంతో ప్రధాన కంపెనీలు తమ వివిధ మోడళ్లపై రేట్లను ఎలా తగ్గించాయో చూద్దాం..

1. హోండా మోటార్స్:
సిబిఇ350 రూ.17,106
సిబిఇ350ఆర్ఎస్ రూ.17,078
ఎన్ఎక్స్ 200 రూ.13,250
సిబిఇ300ఎఫ్ రూ.13,281
యాక్టివా 100 రూ.7,874
షైన్ 125 రూ.7,443
ఎస్‌పి 125 రూ.8,447

2. హీరో మోటార్స్:
స్పెండర్ ప్లస్ రూ.6,360
హెచ్ఎఫ్ డీలక్స్ రూ.5,625
హీరో గ్రామర్ రూ.7,182
ఎక్స్ ట్రీమ్ 125ఆర్ రూ.7,852

3. యమహా మోటార్స్:
రే జెడ్ఆర్ రూ.7,759
ఫ్యాసినో రూ.8,509
ఎఫ్‌జెడ్ ఎక్స్ హైబ్రిడ్ రూ.12,430
యమహా ఆర్15 రూ.17,581

4. బజాజ్:
ప్లాటినా 100 రూ.5,508
పల్సర్ 125 రూ.7,384
పల్సర్ ఎన్ఎస్ 125 రూ.8,316
పల్సర్ 150 రూ.9,417
పల్సర్ ఎన్ 160 రూ.10,687
పల్సర్ 220ఎఫ్ రూ.10,754
పల్సర్ ఎన్250 రూ.11,267

5. టీవీఎస్:
రైడర్ 125 రూ.8,085
రేడియన్ రూ.6,628
స్పోర్ట్ రూ.4,803
స్టార్ సిటీ ప్లస్ రూ.6,304
రోనిన్ రూ.13,533
జూపిటర్ 110 రూ.7,269
జూపిటర్ 125 రూ.7,355
ఎన్టార్క్ 125 రూ.8,530
ఎక్స్ఎల్ 100 రూ.5,022

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad