Tuesday, February 17, 2026
Homeబిజినెస్Gold Rate: భారీగా పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్.. మళ్లీ రేట్ల రివర్స్ గేర్..

Gold Rate: భారీగా పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్.. మళ్లీ రేట్ల రివర్స్ గేర్..

Gold Price Today: బడ్జెట్ ముందు నుంచి ఒక్కసారిగా కుప్పకూలిన గోల్డ్ అండ్ సిల్వర్ కి రోజురోజుకూ డిమాండ్ పెరుగుతూ పోతోంది. దీంతో తగ్గిన రేట్లకు షాపింగ్ చేయాలని ప్రజలు భావించటమే మళ్లీ రేట్ల ర్యాలీకి కారణంగా నిపుణులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెరిగిన రిటైల్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

- Advertisement -

గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్త ఏడాదిలో అంతర్జాతీయ పరిణామాలు మెల్లగా కొలిక్కి వచ్చేందుకు ప్రయత్నాలు జరిగితే ధరలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.

also read BJP: నేడు తెలంగాణకు బీజేపీ బాస్ నితిన్ నబీన్.. మహబూబ్ నగర్‌లో భారీ బహిరంగ సభ!

బుధవారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.16,053 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.14,715 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.3లక్షల 20వేల వద్ద ఉంది.

ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.16,256, ముంబైలో రూ.16,053, దిల్లీలో రూ.14,730, కలకత్తాలో రూ.16,053, బెంగళూరులో రూ.16,053, కేరళలో రూ.16,053 వద్ద కొనసాగుతున్నాయి.

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.14,900, ముంబైలో రూ.14,715, దిల్లీలో రూ.14,730, కలకత్తాలో రూ.14,715, బెంగళూరులో రూ.14,715, కేరళలో రూ.14,715గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News