Perpetual Futures : పెర్పెట్యూయల్ ఫ్యూచర్స్ అనేది ఒక ప్రత్యేకమైన క్రిప్టో డెరివేటివ్ కాంట్రాక్ట్. ఇది సాధారణ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇన్వెస్టర్లకు ఉండే సదవకాశం ఏంటంటే దీనికి ఎటువంటి ముగింపు తేదీ ఉండకపోవటమే. అంటే ఈ కాంట్రాక్ట్ ఎప్పటివరకు కావాలన్నా ఇన్వెస్టర్లు హోల్డ్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పుకోవాలంటే క్రిప్టో ట్రేడర్లు బిట్ కాయిన్, ఇథీరియం సహా ఏవైనా క్రిప్టో కరెన్సీ ధరల్లో పెరుగుదల లేదా తగ్గుదలను ఊహించటం ద్వారా లాభాలను పొందొచ్చు. అయితే దీనికి పెర్పెట్యూయల్ ఫ్యూచర్స్ ఎలా తక్కువ పెట్టుబడితో సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఎక్పైరీ ఉండదు: సాధారణ ఫ్యూచర్స్ కాంట్రాక్టు ఒక నిర్దిష్ట తేదీన ముగియడం ఉంటే ఇది ఎప్పటికీ కొనసాగుతుంది.
2. ఫండింగ్ రేట్: ఈ కాంట్రాక్టు ధరను నిజమైన మార్కెట్ స్పాట్ రేటుకు దగ్గరగా ఉంచేందుకు ఓ ప్రత్యేక పేమెంట్ పద్ధతి ఉంటుంది. దీన్ని ఫండింగ్ రేట్ అంటారు. దీని ద్వారా లాంగ్, షార్ట్ పొజిషన్లకు మధ్య చెల్లింపులు జరుగుతాయి.
3. లీవరేజ్: పెర్పెట్యూయల్ ఫ్యూచర్స్‌లలో మీరు తక్కువ డిపాజిట్ పెట్టి ఎక్కువ మొత్తంలో ట్రేడింగ్ చేయవచ్చు. ఇది లాభాన్ని ఎంతగానో పెంచుతుంది.అలాగే నష్టాలు కూడా పెంచే ప్రమాదం ఉంటుంది.
4. కాష్ సెట్టిల్మెంట్: ఎటువంటి క్రిప్టోకరెన్సీకి డెలివరీ అవసరం లేదు. లాభాన్నీ నష్టాన్నీ డబ్బుగా సెటిల్ చేస్తారు.
5. స్మార్ట్ ట్రేడింగ్: మీరు క్రిప్టో ధరపై డైరెక్ట్ యాక్సెస్ లేకుండానే స్మార్ట్ గా ట్రేడ్ చేయవచ్చు. అలాగే మీ స్పాట్ మార్కెట్ పెట్టుబడులను కూడా రక్షించుకోవచ్చు.
ప్రస్తుతం దేశంలోని ప్రముఖ క్రిప్టో ఎక్ఛ్సేజీలైన జియోటస్, కాయిన్ డీసీఎక్స్, కాయిన్ స్విచ్, ముద్రెక్స్, జెబ్ పే, డెల్టా ఎక్స్ఛేంజీ లాంటి కంపెనీలు అందిస్తున్నాయి. జియోటస్ తాజాగా దీనిని ప్రారంభించటంతో సెప్టెంబర్ 30 వరకు యూజర్లకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఫ్రీ ట్రేడింగ్ ఆఫర్ చేస్తోంది. పైగా ఈ పెట్టుబడిని కేవలం రూ.100 నుంచి స్టార్ట్ చేయెుచ్చని కంపెనీ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ చెబుతున్నారు.


