Saturday, November 15, 2025
Homeబిజినెస్Stock Market Fall: ఆరు రోజుల లాభాల జోరుకు బ్రేక్.. నష్టాల్లో ట్రేడవుతున్న సెన్సెక్స్-నిఫ్టీ ఎందుకంటే..?

Stock Market Fall: ఆరు రోజుల లాభాల జోరుకు బ్రేక్.. నష్టాల్లో ట్రేడవుతున్న సెన్సెక్స్-నిఫ్టీ ఎందుకంటే..?

Sensex-Nifty Fall: గడచిన ఆరు ట్రేడింగ్ సెషన్ల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాల్లోనే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. దీనికి కారణం పోయిన వారం ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవం సమయంలో జీఎస్టీతో పాటు దేశ ఆర్ధిక పురోగతి స్వావలంభన గురించి చేసిన కొన్ని కీలకమైన ప్రకటనలని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

తాజాగా గురువారం రోజున మంత్రుల బృందం 12 శాతం, 28 శాతం జీఎస్టీ స్లాబ్ రేట్లను తొలగించటానికి ఆమోదం తెలిపినప్పటికీ వారాంతంలో మార్కె్ట్లు నష్టాలబాట పట్టాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 400 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 128 పాయింట్ల నష్టంలో ట్రేడవుతోంది. అలాగే కీలకమైన నిఫ్టీ బ్యాంక్ సూచీ కూడా 325 పాయిట్ల నష్టంతో ఉండగా.. స్వల్ప లాభాల్లో ప్రారంభమైన నిఫ్టీ మిడ్ క్యాప్ ఏకంగా 70 పాయింట్ల నష్టంలోకి జారుకుంది.

నేడు మార్కెట్ల ఇంట్రాడే ఆరంభ ట్రేడింగ్ సమయంలో టాటా మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, జియో ఫైనాన్షియల్, ఎల్ అండ్ టి, హిందాల్కో కంపెనీల షేర్లు నిఫ్టీలో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.

మార్కెట్ల ప్రతికూలతలపై నిపుణుల మాట..
ట్రంప్ సుంకాల వల్ల మార్కెట్‌కు ఎదురయ్యే ప్రతికూలతలు గత 6 రోజుల ర్యాలీని అడ్డుకుంటున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ విజయకుమార్ అన్నారు. ట్రంప్ ప్రకటించిన అదనపు 25 శాతం సుంకాల కారణంగా భారత వృద్ధి 30 బేసిస్ పాయింట్ల వరకు తగ్గొచ్చనే ఉన్నప్పటికీ వాస్తవంగా అది ఇంకా ఎక్కువగా ఉండొచ్చని ఆయన అన్నారు. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు ప్రధానంగా కంపెనీల విలువలపై దృష్టి పెడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ల పతనం గురించి మాట్లాడుతూ ఆర్థిక వృద్ధి తగ్గుదల అంచనాలకు అనుగుణంగా కంపెనీల విలువలను ఈక్విటీ మార్కెట్లు తగ్గిస్తాయని అది సాధారణంగా జరిగేదేనన్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో లార్జ్ క్యాప్ స్టాక్స్ మంచి పనితీరును కనబరుస్తున్న ధోరణి కొనసాగుతోందని కూడా ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad