KTM 160 Duke vs Yamaha MT-15: భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో స్ట్రీట్‌ఫైటర్ బైక్‌ల క్రేజ్ నిరంతరం పెరుగుతోంది. ఈ విభాగంలో రెండు బలమైన బైక్స్ KTM 160 డ్యూక్, యమహా MT-15 ముఖాముఖి తలపడుతున్నాయి. కంపెనీ తయారీదారులు వీటిని యువతను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఈ రెండు బైక్స్ ఫీచర్లు, పనితీరు పరంగా అద్భుతంగా ఉన్నాయి. కావున ఏ బైక్ కొనాలో గందరగోళంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ఏ బైక్ కొనాలి? ఏ బైక్ డబ్బుకు తగిన విలువను ఇస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
KTM 160 Duke vs Yamaha MT-15 ధర:
ఇటీవల మార్కెట్లో లాంచ్ అయినా KTM 160 డ్యూక్ ధర దాదాపు రూ. 1.85 లక్షలు. అదేవిధంగా యమహా MT-15 ఇప్పటికే రూ. 1.70 నుండి 1.81 లక్షల ధరల శ్రేణిలో అందుబాటులో ఉంది.
ALSO READ:Discount: రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 5G పై కళ్ళు చెదిరే ఆఫర్..లాంచ్ ధర కంటే రూ.8000 తక్కువ!
KTM 160 Duke vs Yamaha MT-15 ఇంజిన్:
KTM 160 డ్యూక్‌ను చూస్తే, ఇది స్ట్రీట్‌ఫైటర్ లుక్ ప్రియుల కోసం తయారు చేయబడిందని అర్థం అవుతుంది. ఈ బైక్ లో దాదాపు 18.7bhp శక్తిని, 15.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే శక్తివంతమైన 164.2cc ఇంజిన్ అందుబాటులో ఉంది. మరోవైపు..యమహా MT-15 బైక్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 155cc ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది దాదాపు 18.1bhp పవర్, 14.1Nm టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్ ఇంజిన్ KTM 160 డ్యూక్ తో పోలిస్తే సీసీ కాస్త తక్కువగా ఉంటుంది.
KTM 160 Duke vs Yamaha MT-15 ఫీచర్లు:
ఈ రెండు బైక్ ల ఫీచర్ల విషయానికి వస్తే..KTM 160 డ్యూక్ LED లైటింగ్, 5-అంగుళాల LCD డిస్ప్లే, డ్యూయల్-ఛానల్ ABS, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది. అలాగే, యమహా MT-15 బైక్ కలర్ TFT డిస్ప్లే, ట్రాక్షన్ కంట్రోల్, బ్లూటూత్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ వంటి లక్షణాలను కలిగి ఉంది.
ఏ బైక్ కొంటె బెస్ట్?
కొంచెం ఎక్కువ పవర్, స్పోర్టీ లుక్, అద్భుతమైన పనితీరు కోరుకుంటే, KTM 160 డ్యూక్‌ను ఎంచుకోవచ్చు. ఇదే సమయంలో తేలికైన, స్టైలిష్, టెక్నాలజీతో కూడిన బైక్ కావాలనుకుంటే, యమహా MT-15 బైక్ సరైన ఎంపిక కావచ్చు.


