Jeff Bezos Secon wife: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వివాహం ఇటీవల వెనిస్‌లో అత్యంత వైభవంగా ముగిసింది. బెజోస్ మొదటి భార్య మాకెంజీ స్కాట్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో 1993 వివాహం చేసుకోగా, వీరి బంధం 2019 వరకు జాయింట్’గా ఉంది. ఆ తర్వాత ఆమెతో విడాకులు, ఆస్తుల్లో భారీగా వాటా ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు జెఫ్ బెజోస్ మళ్లీ లారెన్ సాంచెజ్ ను వివాహం చేసుకున్నారు. మూడు రోజుల పాటు సాగిన ఈ జంట వివాహ వేడుక ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది. కొత్త వధువు లారెన్ సాంచెజ్ మళ్లీ హైలైట్ అవుతోంది. ఆమె డోల్చె అండ్ గబ్బానా గౌన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే వాస్తవానికి ఈ లారెన్ ఎవరు? ఆమె జీవిత ప్రయాణం ఎలా సాగింది? ఆమె గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లారెన్ సాంచెజ్.. ఒక చిన్న పట్టణ యువతి నుండి అంతరిక్షం వరకు ప్రయాణం
లారెన్ సాంచెజ్ 1969లో న్యూమెక్సికోలో జన్మించింది. ఆమె అసలు పేరు వెండీ సాంచెజ్, ఇంకా ఎల్ కామినో కాలేజీ అనంతరం యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియాలో చదువుకుంది. తన చదువుకు ప్రాధాన్యత ఇస్తూనే, టీవీ జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టింది. లారెన్ తన కెరీర్‌ను ఫినిక్స్‌లోని కెటివికె-టీవీలో ప్రారంభించింది. తరువాత ఆమె ‘Extra’ అనే వినోద కార్యక్రమంలో రిపోర్టర్‌గా పనిచేసింది. అలాగే Fox Sports Net లోనూ ఆమె ముఖ్య పాత్రలు నిర్వహించింది. ఆమె ‘Goin’ Deep’ అనే న్యూస్ మ్యాగజైన్ షోలో చేసిన పని వల్ల ఎమి అవార్డ్ నామినేషన్ కూడా వచ్చాయి. చివరికి, 1999లో ‘UPN News 13’ కోసం ఆమె ఎమి అవార్డు గెలుచుకుంది. తర్వాత, లారెన్ ‘So You Think You Can Dance’ అనే పాపులర్ డ్యాన్స్ షోకి మొదటి హోస్ట్‌గా పనిచేసింది. కానీ ఆమె ప్రయాణం ఇక్కడితో ఆగలేదు.
పైలట్ నుంచి వ్యోమగామి వరకు..
40 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత లారెన్ సాంచెజ్ ఓ విభిన్న నిర్ణయం తీసుకుంది. ఆమె హెలికాప్టర్ పైలట్ లైసెన్స్ తీసుకుంది. 2016లో ఆమె స్థాపించిన Black Ops Aviation అనే కంపెనీ అమెరికాలోనే మొట్టమొదటి మహిళా యజమాని కలిగిన ఏరియల్ ఫిల్మింగ్ కంపెనీగా నిలిచింది. 2024లో లారెన్ ఓ చిల్డ్రన్ బుక్ కూడా రాశారు. “The Fly Who Flew to Space”. 2023లో ఆమె జెఫ్ బెజోస్ కు చెందిన Blue Origin NS-31 రాకెట్ ద్వారా అంతరిక్ష సరిహద్దుకు ప్రయాణించిన ఆరుగురు మహిళల్లో ఒకరిగా గుర్తింపు పొందింది. ఆమె ప్రయాణం 10 నిమిషాల పాటు సాగింది. లారెన్‌కు మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె పెద్ద కుమారుడు నిక్కో, మాజీ NFL ప్లేయర్ టోని గోన్జాలెజ్ తో కలిగి ఉన్నారు. అలాగే మాజీ భర్త పాట్రిక్ వైట్సెల్ తో కలిసి ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
జెఫ్ బెజోస్ – లారెన్ వివాహం
2025 జూన్‌లో లారెన్ సాంచెజ్, జెఫ్ బెజోస్ మూడు రోజుల పాటు సాగిన వెనిస్లో వివాహం చేసుకున్నారు. ఈ వేడుక ఆర్సెనాలే, ఒక పాత మధ్యయుగ నౌకా నిర్మాణ స్థలంలో నిర్వహించబడింది. అమెరికన్ మీడియా రిపోర్టుల ప్రకారం, ఈ వేడుక మొత్తం దాదాపు రూ.400 కోట్లకు పైగా ఖర్చుతో నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు బిల్ గేట్స్, లియోనార్డో డికాప్రియో, కిమ్ కార్డాషియన్, కైలీ జెన్నర్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. సాంప్రదాయ, ఆధునిక శైలుల మేళవింపుతో ఈ వేడుక జరిగిన తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
లారెన్ సాంచెజ్ జీవిత ప్రయాణం ఒక సాధారణ న్యూస్ రిపోర్టర్‌గా మొదలై, హెలికాప్టర్ పైలట్, వ్యోమగామి, రచయిత, వ్యాపారవేత్తగా విస్తరించింది. ఇప్పుడు ఆమె ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ భార్యగా కూడా గుర్తింపు పొందింది.