Mutual fund : సాంప్రదాయ పొదుపు పథకాలైన పోస్టాఫీసు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడులు కావాలా? స్టాక్ మార్కెట్ రిస్క్ చూసి భయపడుతున్నారా? అయితే మీలాంటి వారికోసమే మ్యూచువల్ ఫండ్స్ మ్యాజిక్ చేస్తున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా నమ్మకానికి మారుపేరుగా నిలిచిన ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ , తన ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసే దిశగా అడుగులు వేస్తోంది.
ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ అందిస్తున్న ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్’ గత పదేళ్లలో కళ్లు చెదిరే రాబడులను అందించింది. ఒకవేళ మీరు పదేళ్ల క్రితం ఈ పథకంలో నెలకు రూ. 10,000 చొప్పున పెట్టుబడి (SIP) పెట్టి ఉంటే, ఈరోజు మీ పెట్టుబడి విలువ ఏకంగా రూ. 34 లక్షలకు పైగా ఉండేది. ఈ ఫండ్ పదేళ్లలో ఏడాదికి సగటున 19.86 శాతం వార్షిక రాబడిని అందించడమే ఇందుకు కారణం.
కేవలం నెలవారీ పొదుపు చేసేవారికే కాదు, ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేవారికి కూడా ఈ ఫండ్ కాసుల వర్షం కురిపించింది.మీరు మూడేళ్ల క్రితం పెట్టిన రూ. 1 లక్ష ఇప్పుడు రూ. 2.10 లక్షలు అయింది. ఐదేళ్ల క్రితం పెట్టిన లక్ష రూపాయలు రూ. 3.31 లక్షలుగా పెరిగింది.పదేళ్ల క్రితం ఒకేసారి పెట్టిన లక్ష రూపాయలు ఇప్పుడు రూ. 5.17 లక్షలు అయింది.
Apple: గచ్చిబౌలిలో యాపిల్ భారీ ఆఫీస్.. నెలకు అద్దె రూ. 71 లక్షలు
ఈ స్కీమ్ 2013లో ప్రారంభమైంది. అప్పటి నుంచి స్థిరమైన రాబడులతో ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటోంది.ఎక్స్‌పెన్స్ రేషియో 0.83% తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం. డిసెంబర్ 2025 నాటికి ఈ ఫండ్ కింద రూ. 1003 కోట్ల ఆస్తులు ఉన్నాయి.మార్కెట్‌లో ఎప్పుడూ రిస్క్ ఉంటుంది, కానీ సరైన ఫండ్‌ను ఎంచుకుని దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే ‘చక్రవడ్డీ’ మ్యాజిక్ ఎలా ఉంటుందో ఎల్ఐసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నిరూపించింది. మౌలిక సదుపాయాల రంగం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి, భవిష్యత్తులో కూడా ఈ ఫండ్ ఆశాజనకమైన రాబడులు ఇచ్చే అవకాశం ఉంది.

