LIC New Schemes 2025 : ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) రెండు కొత్త పాలసీలను లాంచ్ చేసింది. ‘జన సురక్ష’ (ప్లాన్ 880), ‘బీమా లక్ష్మి’ (ప్లాన్ 881) పేరుతో ఈ స్కీమ్‌లు అక్టోబర్ 15 నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఆదాయ వర్గాలకు ‘జన సురక్ష’ బీమా సదుపాయం కల్పిస్తుంది. ‘బీమా లక్ష్మి’ మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా రూపొందించారు. రెండూ నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ పాలసీలు. మార్కెట్ రిస్క్ లేకుండా, బోనస్ చెల్లింపులు లేకుండా సురక్షిత హామీలు అందిస్తాయి.
ALSO READ: Weather Update: సూర్యుని చుట్టూ వలయం.. ఇదే వర్షాలకు సంకేతం!
జన సురక్ష (ప్లాన్ 880): తక్కువ ప్రీమియంతో సాధారణ ప్రజలకు బీమా. వయసు 18-55 ఏళ్లు. పాలసీ టర్మ్ 12-20 ఏళ్లు. హామీ మొత్తం రూ.1-2 లక్షలు. ప్రీమియం చెల్లింపు టర్మ్‌కంటే 5 ఏళ్లు తక్కువ (12 టర్మ్ అయితే 7 ఏళ్లు). వార్షిక ప్రీమియంపై 4% గ్యారంటీడ్ అడిషన్స్ (GA). మెచ్యూరిటీ సమయంలో హామీ మొత్తం + GA చెల్లిస్తారు. మరణం జరిగితే హామీ మొత్తం చెల్లిస్తారు. నెలవారీ, త్రైమాసిక, షెమి-అన్యువల్, అన్యువల్ ప్రీమియం ఆప్షన్లు. రుణ సదుపాయం, రైడర్లు (అక్సిడెంట్ డెత్, క్రిటికల్ ఇల్‌నెస్) జోడించవచ్చు. తక్కువ ప్రీమియంతో సురక్షిత బీమా కోసం డిజైన్ చేశారు.
బీమా లక్ష్మి (ప్లాన్ 881): మహిళలకు ప్రత్యేకంగా బీమా + పొదుపు కలిపిన స్కీమ్. వయసు 18-50 ఏళ్లు. పాలసీ టర్మ్ 25 ఏళ్లు. ప్రీమియం చెల్లింపు 7-15 ఏళ్లు. హామీ మొత్తం మినిమమ్ రూ.2 లక్షలు, మ్యాక్స్ లిమిట్ లేదు. ఆప్షన్ A: టర్మ్ పూర్తయ్యాక 50% మొత్తం వెనక్కి. ఆప్షన్ B: ప్రతి 2 ఏళ్లకు 7.5% (12 సార్లు). ఆప్షన్ C: ప్రతి 4 ఏళ్లకు 15% (6 సార్లు). వార్షిక ప్రీమియంపై 7% GA. మరణం జరిగితే 10 రెట్లు అన్యువల్ ప్రీమియం లేదా హామీ మొత్తం (ఏది ఎక్కువ). ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు: నెలవారీ, త్రైమాసిక, షెమి-అన్యువల్, అన్యువల్. రైడర్లు: అక్సిడెంట్ డెత్, న్యూ టర్మ్ అష్యూరెన్స్, ఫీమేల్ క్రిటికల్ ఇల్‌నెస్. మహిళల ఆర్థిక భద్రతకు డిజైన్ చేశారు.
ఈ పాలసీలు తక్కువ ఆదాయ వర్గాలు, మహిళలకు సురక్షిత బీమా అందిస్తాయి. దరఖాస్తు LIC బ్రాంచ్‌లలో, వెబ్‌సైట్‌లో. మరిన్ని వివరాలకు licindia.in చూడండి.


