Saturday, November 15, 2025
Homeబిజినెస్LIC Jeevan Utsav policy: పెట్టుబడి ఒక్కసారి.. జీవితాంతం ఆదాయం.. ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ గురించి...

LIC Jeevan Utsav policy: పెట్టుబడి ఒక్కసారి.. జీవితాంతం ఆదాయం.. ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ గురించి మీకు తెలుసా?

LIC Jeevan Utsav policy: మధ్యతరగతి కుటుంబం నుంచి ఉన్నత కుటుంబాల వరకు అందరూ సేవింగ్స్ చేయాలనే అనుకుంటారు.  కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బుకు భద్రతా ఉండాలని, అందుకు మరింత లాభం రావాలని కోరుకోవడం సహజం. అదే సమయంలో కుటుంబానికి పెద్ద దిక్కైన వ్యక్తికి జరగరానిది ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే అప్పుడు కుటుంబానికి ఆర్థిక భరోసా ఎవరిస్తారు? అలాంటి సమయంలో ఎల్‌ఐసీలో ఎన్నో పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయింతే, ఎల్ఐసీవైపే అందరూ మొగ్గు చూపుతున్నారు. కాగా.. ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే పొదుపు+ బీమాతో పాటు గ్యారెంటీ రిటర్న్స్‌ వచ్చేలా ఎల్‌ఐసీ ఓ కొత్త పాలసీని తీసుకొచ్చింది. అదే జీవన్‌ ఉత్సవ్‌ పాలసీ. ఇదో నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌, ఇండివిడ్యువల్‌, సేవింగ్స్‌, జీవితాంతం బీమా అందించే పాలసీ. నాన్-లింక్డ్ అంటే అది అందించే రాబడి ఇతర మార్కెట్ల రాబడిపై ఆధారపడి ఉండదు. ఇది పాలసీలో పేర్కొన్న స్థిరమైన రాబడిని అందిస్తుంది. ఒకసారి ఈ పాలసీ తీసుకుంటే.. ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసిన తర్వాత జీవితాంతం ఆదాయం పొందవచ్చు. ఆ ప్లాన్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

5 నుండి 16 సంవత్సరాల ప్రీమియం:

జీవన్ ఉత్సవ్ బీమా పథకాలు 90 రోజుల శిశువు నుండి 65 సంవత్సరాల వయస్సు గల సీనియర్ సిటిజన్ వరకు ఎవరికైనా అందుబాటులో ఉన్నాయి. కనీస బీమా మొత్తం (బేసిక్ సమ్ అష్యూర్డ్) రూ. 5 లక్షలు. జీవన్ ఉత్సవ్ ప్రీమియం చెల్లింపు వార్షికం, కనీసం 5 సంవత్సరాల కాలపరిమితి. గరిష్ట కాలపరిమితి 15 సంవత్సరాలు. అంటే, మీరు ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లించవచ్చు. లేదా మీరు 16 సంవత్సరాల వరకు మీకు కావలసినన్ని సార్లు చెల్లించవచ్చు.

Read Also: Chinneti Vaagu: వృద్ధురాలు చేసిన పని చేయలేక.. వాగును దాటే అవగాహన లేక యువకుడు గల్లంతు..!

జీవన్ ఉత్సవ్ ఎంత రాబడిని ఇస్తుంది?

ఈ పాలసీలో కనీస బీమా మొత్తం రూ. 5,00,000. మీరు కావాలనుకుంటే ఎక్కువ బీమా మొత్తాన్ని ఎంచుకోవచ్చు. మీరు కనీసం రూ. 5 లక్షల బీమా మొత్తంతో పాలసీని ఎంచుకుంటే, అలాగే ఐదు సంవత్సరాల ప్రీమియం ఎంపికను ఎంచుకుంటే మీరు సంవత్సరానికి రూ. 1.16 లక్షలు చెల్లించాలి. ఐదు సంవత్సరాలలో మీరు దాదాపు రూ. 5.80 లక్షలు చెల్లించి చెల్లిస్తారు. దీని తరువాత ఐదు సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మీరు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఐదు సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ తర్వాత మీకు సంవత్సరానికి రూ. 50,000 చెల్లింపు కొనసాగుతుంది. మీ జీవితాంతం ప్రతి సంవత్సరం రూ. 50,000 ఆదాయం మీకు కొనసాగుతుంది. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే నామినీలకు రూ. 5 లక్షల పరిహారం లభిస్తుంది.

ఎక్కువ చెల్లింపు కావాలా?

మీరు అధిక చెల్లింపు కోరుకుంటే మీరు ఎక్కువ ప్రీమియం చెల్లించాలి. ఎగ్జాంపుల్ మీరు సంవత్సరానికి రూ. 5 లక్షల ఆదాయం పొందాలనుకుంటే మీరు రూ. 50 లక్షల ప్రాథమిక బీమా మొత్తంతో ఒక పథకాన్ని ఎంచుకోవచ్చు. అప్పుడు మీరు 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి దాదాపు రూ. 11 లక్షల ప్రీమియం చెల్లించాలి.

Read Also: Viral Video: వామ్మో కలికాలం అంటే ఇదేనా..బతికున్న పాముని తిన్న ఉడుత

నెలకు రూ.15 వేలు రావాలంటే?

అదే మీరు సమ్ అష్యూర్డ్ రూ.18 లక్షలు ఉండేలా ప్రీమియం చెల్లించినట్లయితే మీకు ఏడాదికి లక్షా ఎనభై వేలు అందుతాయి. దీని ప్రకారం నెలకు రూ.15 వేలు చేతికి వస్తాయి. ఇలా మీకు 100 సంవత్సరాలు వచ్చే వరకు అందుతాయి. ఎల్‌ఐసీ జీవన్‌ ఉత్సవ్‌ పాలసీని ఎల్‌ఐసీ ఏజెంట్‌ ద్వారా గానీ, ఆన్‌లైన్‌లో గానీ కొనుగోలు చేయవచ్చు. ఈ పాలసీపై రుణ సదుపాయం కూడా ఉంది. పాలసీ చెల్లింపు సమయంలోనూ, ఆదాయం మొదలైన తర్వాత కూడా రుణం తీసుకోవచ్చు. అయితే, అప్పుపై చెల్లించే వడ్డీ, రెగ్యులర్‌ ఆదాయంలో 50 శాతం మించకూడదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad