Scheme: దేశంలో మహిళలకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఒక వినూత్న పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఇది కేవలం బీమా మాత్రమే కాదు, మార్కెట్ ఒడుదొడుకులతో సంబంధం లేకుండా, హామీతో కూడిన రాబడిని అందించే పొదుపు పథకం.
సురక్షితమైన పెట్టుబడి – గ్యారెంటీడ్ అడిషన్
ఈ పాలసీ యొక్క అతిపెద్ద ఆకర్షణ గ్యారెంటీడ్ అడిషన్ . ఇది నాన్-లింక్డ్ స్కీమ్ కాబట్టి, మీ డబ్బు స్టాక్ మార్కెట్ రిస్క్‌లో పడదు. పాలసీదారు ప్రతి సంవత్సరం చెల్లించిన ప్రీమియంపై ఏకంగా 7 శాతం చొప్పున హామీతో కూడిన అదనపు మొత్తాన్ని (గ్యారెంటీడ్ అడిషన్) పాలసీకి జోడిస్తారు.25 ఏళ్ల పాలసీ టర్మ్ పూర్తయిన తర్వాత, హామీ మొత్తం (Sum Assured)తో పాటు, పాలసీ మొత్తం వ్యవధికి లెక్కించిన గ్యారెంటీడ్ అడిషన్ కలిపి చెల్లిస్తారు.
విడతలవారీగా డబ్బు వెనక్కి తీసుకునే ఆప్షన్లు
పాలసీదారులు తమ నగదు అవసరాలకు అనుగుణంగా, ప్రీమియం చెల్లింపు టర్మ్ తర్వాత హామీ మొత్తాన్ని విడతలవారీగా వెనక్కి తీసుకునే మూడు ఆప్షన్లు (A, B, C) ఉన్నాయి. ఉదాహరణకు, ఆప్షన్ B ఎంచుకుంటే, పాలసీ కాలంలో ప్రతి రెండేళ్లకోసారి హామీ మొత్తంలో 7.5% చొప్పున మొత్తం 12 సార్లు డబ్బు తీసుకోవచ్చు.
కేవలం రోజుకు ₹125 పొదుపుతో ₹8.44 లక్షలు
మీరు రోజుకు కేవలం ₹125 (వార్షికంగా ₹44,940) చొప్పున 10 ఏళ్లు పొదుపు చేసినా, 25 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత మీరు అందుకునే మొత్తం భారీగా ఉంటుంది. ₹2 లక్షల బీమా హామీకి, సుమారు ₹6.44 లక్షల గ్యారెంటీడ్ అడిషన్ తోడై, మొత్తం ₹8,44,889 వరకు పొందవచ్చు. అదనంగా, ఆప్షన్ B కింద మధ్యలో పొందే ₹1.80 లక్షలు కూడా కలుపుకుంటే, రాబడి మొత్తం ₹10 లక్షల మార్కును చేరుకుంటుంది!
ఈ పాలసీలో స్త్రీల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఫిమేల్ క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ వంటి అదనపు రక్షణ కవర్లు (రైడర్లు) కూడా అందుబాటులో ఉన్నాయి. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలకు అందుబాటులో ఉన్న ఈ పాలసీ, వారికి సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తును అందిస్తుంది.


