LPG Gas: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా కొరత, డెలివరీలో జాప్యం, ధరల పెరుగుదల వంటి సమస్యలు తలెత్తాయి. ఈ సంక్షోభం నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సిలిండర్ బుకింగ్‌పై నిబంధనలను కఠినతరం చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ఎల్పీజీ సిలిండర్ల పంపిణీకి సంబంధించి కొత్త నిబంధనలపై చర్చిస్తున్నాయి.
అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో దేశంలో ఎల్‌పీజీ (LPG) గ్యాస్ బుకింగ్‌లో మే 1వ తేదీ నుంచి కొత్త మార్పులు రానున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ధరల పెంపుతో పాటు, మే నెల నుంచి గ్యాస్ బుకింగ్, డెలివరీ నిబంధనల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
భారీగా పెరగనున్న ధరలు
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే గత నెలలోనే 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరపై సుమారు రూ. 60 పెంచారు. ఇక కమర్షియల్ వినియోగదారులపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఏప్రిల్ 2026 నాటికి ఏకంగా రూ. 196 పెరిగింది. మే 1వ తేదీన చమురు సంస్థలు నిర్వహించే నెలవారీ సమీక్షలో ధరలు మరోసారి సవరించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
OTP తప్సనిసరి
కేవలం ధరలే కాకుండా సిలిండర్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయబోతుందట. నగరాల్లో నివసించే వారు ఒక బుకింగ్‌కు, మరో బుకింగ్‌కు మధ్య కనీసం 25 రోజుల విరామం పాటించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువు 45 రోజులుగా నిర్ణయించారు.గ్యాస్ డెలివరీ సమయంలో ఓటీపీ (OTP) ఆధారిత ప్రామాణీకరణ ఇకపై శాశ్వతం కానుంది. సిలిండర్ల మళ్లింపును అరికట్టేందుకు ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నారు. ప్రస్తుతం 98 శాతం బుకింగ్‌లు ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుండగా మే నెల నుంచి డెలివరీ వ్యవస్థను మరింత డిజిటలైజ్ చేయనున్నారు.
ఆధార్ ఈ-కేవైసీ కూడా
గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఈ-కేవైసీపై (e-KYC)పై అధికారులు మరోసారి స్పష్టత ఇచ్చారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేయాలి వెల్లడించింది. ఆర్థిక సంవత్సరంలో ఏడు రీఫిల్స్ పూర్తయ్యాక, ఎనిమిదో సిలిండర్ నుండి సబ్సిడీ పొందాలంటే ఈ ప్రామాణీకరణ అవసరం. ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేసిన సాధారణ వినియోగదారులు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు.
Also Read: Shiyas Kareem: లైంగిక వేధింపులు.. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై మహిళ ఫిర్యాదు

