Friday, December 12, 2025
Homeబిజినెస్Mahindra BE 6: మహీంద్రా నుంచి తొలి స్పోర్ట్స్‌ ఈ-థీమ్‌ ఎలక్ట్రిక్‌ కారు.. పిచ్చెక్కించే ఫీచర్లు,...

Mahindra BE 6: మహీంద్రా నుంచి తొలి స్పోర్ట్స్‌ ఈ-థీమ్‌ ఎలక్ట్రిక్‌ కారు.. పిచ్చెక్కించే ఫీచర్లు, ధర వివరాలివే..!

Mahindra BE 6 Formula E Edition Sports Car Launch: మహీంద్రా & మహీంద్రా భారత మార్కెట్‌లోకి తన కొత్త ఎలక్ట్రిక్‌ వెహికల్‌ను రిలీజ్‌ చేసింది. బీఈ 6 ఫార్ములా ఈ ఎడిషన్‌ను లాంచ్‌ చేసి ప్రపంచంలోనే మొదటి ఫార్ములా ఈ-థీమ్‌డ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడల్‌గా ప్రత్యేక గుర్తింపు పొందింది. భారతదేశంలో మోటార్‌స్పోర్ట్స్ పట్ల యువత ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్‌ స్టైలింగ్‌ను తీసుకొచ్చింది. ఈ కారు బయట డిజైన్ పూర్తిగా మోటార్‌స్పోర్ట్ లుక్ కనపడుతుంది. సిగ్నేచర్ బంపర్, సర్కులర్ ప్రోజెక్టర్ హెడ్‌ లాంప్స్, గ్లోస్ బ్లాక్ బెజెల్స్, ఫైర్ స్టార్మ్ ఆరంజ్ హైలైట్స్ ఈ ఎస్‌యూవీకి మరింత స్పోర్టీ లుక్‌ను అందిస్తాయి. ఎవరెస్ట్ వైట్, ఫైర్ స్టోర్మ్ ఆరంజ్, టాంగో రెడ్, స్టీల్త్ బ్లాక్ అనే నాలుగు ఎక్స్‌టీరియర్ రంగులు అందుబాటులో ఉన్నాయి. రేస్‌ట్రాక్ స్టైల్ అల్లాయ్ వీల్స్, ఫైర్ స్టోర్మ్ ఆరంజ్ బ్రేక్ కాలిపర్లు, రూఫ్ & బూట్ స్పాయిలర్లు, ఫార్ములా ఈ డీకల్స్, ఎఫ్‌ఐఏ బ్రాండింగ్, గ్లాస్ రూఫ్/బోనెట్‌పై 12-స్ట్రైప్ గ్రాఫిక్స్ మోడల్‌ వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

- Advertisement -

అదిరిపోయే ఇంటీరియర్‌ లుక్‌..

ఇక, ఇంటీరియర్ పరంగా చూస్తే.. ఫార్ములా ఈ థీమ్‌ కారు ఫైర్ స్టోర్మ్ ఆరంజ్ టచ్‌లతో కూడిన ప్రీమియం క్యాబిన్‌తో వస్తుంది. దీనిలో డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి కలర్ థీమ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఫార్ములా ఈ లోగోలతో డిజైన్ చేసిన సీట్లు, ఎఫ్‌ఐఏ బ్రాండెడ్ సీట్‌బెల్ట్స్, ప్రత్యేక ఎడిషన్ ప్లాక్, ట్రాన్స్‌లుసెంట్ డోర్ ఇన్‌సర్ట్స్, రేస్ కార్ స్టైల్ స్టార్ట్/స్టాప్ బటన్ ఫ్లాప్, కస్టమ్ స్టార్ట్‌అప్ యానిమేషన్ వంటి ఫీచర్లు క్యాబిన్‌ను మరింత స్పోర్టీగా మారుస్తాయి. ఇక, పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. రెండింటిలోను 79kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన 210kW మోటార్ ఉంటుంది. ఈ ఎస్‌యూవీ 0-100 కిమీ వేగాన్ని కేవలం 6.7 సెకన్లలో చేరుతుంది. ఇక దీనికి 180kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల 20% నుంచి 80% వరకు ఛార్జింగ్‌కు 20 నిమిషాలే పడుతుంది. ఐలింక్‌ ఫ్రంట్ సస్పెన్షన్, 5-లింక్ రియర్ సెటప్, ఫ్రీక్వెన్సీ-డిపెండెంట్ డ్యాంపింగ్ వంటి ప్రీమియం సస్పెన్షన్ ఫీచర్లు డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.

జనవరి 14 నుంచి బుకింగ్స్‌ షురూ..

స్మార్ట్ ఫీచర్ల పరంగా చూస్తే.. ఈ ఎడిషన్ అత్యాధునిక టెక్నాలజీతో లాంచ్ అయ్యింది. డ్యుయల్ 12.3 ఇంచ్ డిస్‌ప్లేలు, స్నాప్‌డ్రాగన్‌ 8155 చిప్‌సెట్, వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో & ఆపిల్‌ కార్‌ప్లే, హర్మాన్‌/కార్డాన్‌ 16 స్పీకర్ సిస్టమ్ (డాల్బీ అట్మాస్‌), బిల్ట్-ఇన్ అలెక్సా, ఓటీటీ అండ్ సోషల్ మీడియా యాప్స్, 5జీ సపోర్ట్, Me4U కనెక్టెడ్ స్యూట్ వంటి ఫీచర్లను అందించింది. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, 360° కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, బ్రేక్-బై-వైర్, ఎలక్ట్రానిక్ బ్రేక్ బూస్టర్, డ్రైవర్ డ్రౌసినెస్ డిటెక్షన్, TPMS వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. మొదటి 999 కస్టమర్ల కోసం మహీంద్రా ప్రత్యేక బహుమతులు కూడా అందిస్తోంది. రేసర్ కుశ్ మైనీతో ప్రత్యేక ట్రాక్-డే అనుభవం, మెమొరబిలియా కలిగిన కలెక్టర్ బాక్స్, 0–99 మధ్య ప్రత్యేక డీకల్ నంబర్ ఎంపిక చేసే అవకాశం వంటి ప్రయోజనాలను కూడా అందిస్తోంది. అంతేకాక, ఈ 999 మంది కస్టమర్ల పేర్లు లండన్ ఈ ప్రిక్స్‌లో పోటీ చేసే మహీంద్రా రేసింగ్ కార్‌పై ప్రదర్శించబడతాయి. అలాగే ముగ్గురు కస్టమర్లకు పూర్తి ఖర్చులు మహీంద్రానే భరిస్తూ లండన్ ఈ ప్రిక్స్‌ ప్రత్యక్ష అనుభవం ఇస్తుంది. ఇక ధర విషయానికి వస్తే.. FE2 రూ. 23.69 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌), అదనపు సౌకర్యాలతో కూడిన FE3 ధర రూ. 24.49 లక్షలు (ఎక్స్‌ షోరూం)గా నిర్ణయించింది. ఈ కారు బుకింగ్స్ జనవరి 14, 2026 నుండి ప్రారంభమవుతాయి. కాగా, డెలివరీలు ఫిబ్రవరి 14, 2026 నుండి అందుబాటులో ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News