Homeబిజినెస్Mahindra Scorpio: మహీంద్రా స్కార్పియో ఎన్‌ ఫేస్‌లిఫ్ట్‌ లాంచ్‌.. ఫీచర్లకు ఫిదా అవ్వాల్సిందే..!

Mahindra Scorpio: మహీంద్రా స్కార్పియో ఎన్‌ ఫేస్‌లిఫ్ట్‌ లాంచ్‌.. ఫీచర్లకు ఫిదా అవ్వాల్సిందే..!

Mahindra Scorpio-N Facelift Launch: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా సరికొత్త స్కార్పియో ఎన్‌ను దేశీయ మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. దీని ప్రారంభ ధరను రూ.13.69 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) ఉంటుందని తెలిపింది. ఇక, టాప్‌ వేరియంట్‌ రూ.25.49 లక్షలుగా ఉంటుందని పేర్కొంది. కొత్తగా పనోరమిక్‌ సన్‌రూఫ్‌, అతిపెద్ద ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, ఫుల్లీ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, సరౌండ్‌ వ్యూ కెమెరా వంటి ఫీచర్లను ఈ కొత్త వేరియంట్‌లో చేర్చింది. ఇక, ఈ కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్‌లో చూడటానికి దాదాపు పాత మోడల్‌ మాదిరిగానే ఉంటుంది. 18 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌తో డ్యూయల్‌ టోన్‌ ఫినిష్‌తో వస్తోంది.

- Advertisement -

Also Read: Hyderabad: డయల్ 100 స్థానంలో కొత్త ఎమర్జెన్సీ నంబర్.. 112 ప్రారంభించిన డీజీపీ

అద్భుతమైన ఫీచర్లు.. అధిరిపోయే ఇంటీరియర్‌..

ఇక, ఇంటీరియర్‌ విషయానికి వస్తే.. ఈ కారు లోపల 12.29 అంగుళాల ఫ్రీ-ఫ్లోట్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌ అమర్చింది. 10.24 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ సైతం ఉంటుంది. థార్‌ రాక్స్‌లోనూ ఇదే ఇన్ఫోటైన్‌మెంట్‌, డిజిటల్ క్లస్టర్‌ను గమనించొచ్చు. ఇక, స్కార్పియో ఎన్‌లో బ్లైండ్‌ వ్యూ మానిటర్‌తో కూడిన 540 డిగ్రీల కెమెరాను సైతం అందించింది. 12 స్పీకర్‌ సోనీ ఆడియో సిస్టమ్‌ సైతం ఉంటుంది. వెంటిలేటెడ్‌ సీట్లు, ఆటో డిమ్మింగ్‌ ఐఆర్‌వీఎం, ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, టైప్‌-సి ఛార్జర్‌, ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, లెవల్‌ 2 అడాస్‌ ఫీచర్లు వంటివి ఇందులో ఉన్నాయి. ఇక, కొత్త స్కార్పియో 2.0 లీటర్ల టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌, 2.2 లీటర్ల mHawk డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో లభిస్తోంది. సిక్స్‌స్పీడ్‌ మాన్యువల్‌ లేదా సిక్స్‌ స్పీడ్‌ ఆటోమెటిక్‌ గేర్‌ బాక్స్‌ ఆప్షన్లు సైతం ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి రియర్‌ వీల్‌ డ్రైవ్‌, ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ను సెలెక్ట్‌ చేసుకునే అవకాశం కల్పించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News