Mahindra XUV 3XO: మహీంద్రా SUV కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్! మహీంద్రా GST 2.0 సవరణల పూర్తి ప్రయోజనాన్ని కొనుగోలుదారులకు వెంటనే అందిస్తోంది. అంటే..మహీంద్రా ఎస్‌యూవీలు సెప్టెంబర్ 6 నుండే చౌకగా మారాయి. ప్రభుత్వం కొత్త పన్ను రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానున్నాయి. కంపెనీ ప్రసిద్ధ ఎస్‌యూవీ ఎక్స్‌యువి 3XO అత్యధిక ప్రయోజనాన్ని పొందింది. దీని ధరలు రూ. 1.56 లక్షల వరకు తగ్గాయి. ఈ ఎస్‌యూవీ వేరియంట్ వారీగా అందుబాటులో ఉన్న GST డిస్కౌంట్ గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మహీంద్రా ఎక్స్‌యువి 3XO పెట్రోల్ వేరియంట్ రూ. 1.39 లక్షల వరకు, డీజిల్ వేరియంట్ రూ. 1.56 లక్షల వరకు తగ్గించారు. ఈ ధర తగ్గింపు తర్వాత ఈ మోడల్ సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలో కాస్టలీ గా మారింది. మార్కెట్లో ఈ ఎస్‌యూవీ టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లతో నేరుగా పోటీపడుతుంది.
Also Read:Flipkart-Amazon: ఫ్లిప్‌కార్ట్-అమెజాన్ సేల్.. 55 అంగుళాల స్మార్ట్ టీవీలపై సూపర్ డిస్కౌంట్స్..
మోడల్ వారీగా మాట్లాడుకుంటే, మహీంద్రా ఎక్స్‌యూవీ3XO పెట్రోల్ వేరియంట్‌లు MX1పై రూ. 70,800, MX2 ప్రోపై రూ. 93,200, MX3పై రూ. 1,00,800, MX3 ప్రోపై రూ. 1,04,300, AX5పై రూ. 1,10,400, AX5Lపై రూ. 1,14,000, REVXపై రూ. 1,14,600, AX7పై రూ. 1,19,800, AX7Lపై రూ. 1,39,600 వరకు ప్రయోజనాలను పొందుతున్నాయి. ఇక డీజిల్ వేరియంట్లలో MX2 రూ. 1,04,000 తగ్గింపును పొందుతోంది. MX2 ప్రో రూ. 1,10,800, MX3 రూ. 1,24,600, MX3 ప్రో రూ. 1,28,800, AX5 రూ. 1,35,300, AX7 రూ. 1,41,300, అలాగే, AX7L రూ. 1,56,100 గరిష్ట తగ్గింపును పొందుతోంది. అంటే..వివిధ వేరియంట్‌ల ప్రకారం..వినియోగదారులు రూ. 70 వేల నుండి రూ. 1.56 లక్షల వరకు ప్రత్యక్ష ప్రయోజనాన్ని పొందుతున్నారు.
మహీంద్రా XUV3XO దాని భద్రత కోసం ఇప్పటికే వార్తల్లో ఉంది. దీనికి 5-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్ లభించింది. అలాగే, దీనికి ప్రామాణికంగా 6-ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అలాగే, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉన్న అడ్వాన్స్‌డ్ లెవల్-2 ADAS టెక్నాలజీని అందించారు.


