Saturday, November 15, 2025
Homeబిజినెస్Mahindra XUV400 : బంఫర్ ఆఫర్.. ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా రూ.3.25 లక్షల...

Mahindra XUV400 : బంఫర్ ఆఫర్.. ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా రూ.3.25 లక్షల తగ్గింపు!

Mahindra XUV400 Discount: చాలారోజుల నుంచి కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్! ఈ నవంబర్‌లో మహీంద్రా  తన కార్లపై అత్యధిక డిస్కౌంట్లను అందిస్తోంది. వాటిలో మహీంద్రా XUV400 ఒకటి. దీని ఇప్పుడు కొనుగోలు చేసే ఏకంగా రూ.3.25 లక్షల తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపును నగదు రూపంలో చెల్లిస్తారు. స్టాక్, త‌గ్గింపుల గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని మహీంద్రా డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు స్టాక్‌ను క్లియర్ చేయడానికి ఈ ఆఫర్ ప్రకటించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని EC Pro 34.5kWh వేరియంట్, EL Pro FC 34.5kWh వేరియంట్, EL Pro FC 39.4kWh వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ.15.49 లక్షల నుండి రూ.17.69 లక్షల వరకు ఉంటాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారు గురించి వివరంగా తెలుసుకుందాం.
మహీంద్రా XUV400 ఫీచర్లు:
మహీంద్రా XUV400 కొత్త ప్రో వేరియంట్‌లను EC PRO, EL PRO వేరియంట్‌లుగా పరిచయం చేసింది. కొత్త ఎలెక్టరుకి కారులో డాష్‌బోర్డ్, కొత్త ఫీచర్లు, డ్యూయల్-టోన్ థీమ్, మునుపటి కంటే ఎక్కువ సాంకేతికత ఉన్నాయి. పాత డాష్‌బోర్డ్, క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ డిజైన్ మరింత అధునాతనంగా కనిపించేలా అప్డేట్ చేశారు. డాష్‌బోర్డ్ ప్యాసింజర్ వైపు ఇప్పుడు నిల్వ కోసం పియానో ​​బ్లాక్ ఇన్సర్ట్‌ను కలిగి ఉంది. 34.5 kWh బ్యాటరీ ప్యాక్ 375 కి.మీ పరిధిని కలిగి ఉంది. అయితే 39.4 kWh బ్యాటరీ ప్యాక్ 456 కి.మీ పరిధిని కలిగి ఉంది.
ఈవీ క్లైమేట్ కంట్రోల్ కూడా అప్డేట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారు XUV700,  స్కార్పియో N లను పోలి ఉంటుంది. XUV400 సెంట్రల్ AC వెంట్స్ కూడా పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను కలిగి ఉండేలా తిరిగి అందించారు. స్టీరింగ్ వీల్ కూడా XUV700 లాగానే ఉంటుంది. XUV400 క్యాబిన్‌కు బిగ్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో సహా అనేక కొత్త ఫీచర్లు జోడించారు.
ఈ ఎలక్ట్రిక్ కారులో డ్యూయల్-జోన్ AC, వెనుక సీటు ప్రయాణీకుల కోసం టైప్-C USB ఛార్జర్, కొత్త వెనుక AC వెంట్స్ ఉన్నాయి. ఇది వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు వంటి ఫీచర్లతో కూడా వస్తుంది. ఇది ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా పొందుతుంది. ఇది సన్‌రూఫ్‌ను చేర్చడం ఇదే మొదటిసారి. స్ఫటి పరంగా..ఇది ఆరు ఎయిర్‌బ్యాగులు, రివర్స్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESP) వంటి ఫీచర్లతో వస్తుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad