HomeTop StoriesMakeMyTrip: మేక్‌ మై ట్రిప్‌ క్రేజీ ఫీచర్‌.. హోటళ్లలో చెక్‌ ఇన్‌, చెక్‌ అవుట్‌ సమస్యలకు...

MakeMyTrip: మేక్‌ మై ట్రిప్‌ క్రేజీ ఫీచర్‌.. హోటళ్లలో చెక్‌ ఇన్‌, చెక్‌ అవుట్‌ సమస్యలకు చెక్‌…!

MakeMyTrip’s new feature: ప్రముఖ ట్రావెల్ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ మేక్‌ మై ట్రిప్ మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇకపై హోటల్‌లో ఎన్ని గంటలు ఉంటే అంతే చెల్లించవచ్చని తెలిపింది. పర్యాటక రంగంలో కస్టమర్ల ప్రధాన సమస్యకు చెక్ పెడుతూ ఈ ఫీచర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. చెక్‌ ఇన్‌, చెక్‌ అవుట్‌ విషయంలో కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్‌ పెట్టే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా హోటళ్లకు ఉదయాన్నే చేరుకున్నా, లేదా సాయంత్రం ఆలస్యంగా రూమ్ ఖాళీ చేయాలన్నా సులభతరం అవుతుంది. ప్రయాణికులు పడే ఇబ్బందులను దూరం చేస్తూ.. బుకింగ్ సమయంలోనే ‘ఎర్లీ చెక్-ఇన్’ లేదా ‘లేట్ చెక్-అవుట్’ సదుపాయాన్ని కన్ఫర్మ్ చేసుకునే ఈ కొత్త ఫీచర్‌ కస్టమర్లకు ఎంతో మేలు చేస్తుందని తెలిపింది. అయితే, నిర్ణీత అదనపు రుసుము చెల్లించడం ద్వారా కస్టమర్లు ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చని స్పష్టం చేసింది. అవసరాన్ని బట్టి 3, 6 లేదా 9 గంటల ముందస్తు లేదా అదనపు సమయాన్ని ప్లాన్ చేసుకోవచ్చని తెలిపింది.

- Advertisement -

Alos Read: Heavy rain: కొన్ని జిల్లాల్లో వానలు.. మరికొన్ని చోట్ల ఎండలు.. తెలంగాణలో విచిత్ర పరిస్థితి..!

ఎన్ని గంటలు ఉంటే అంతే చెల్లించండి..!

ప్రస్తుతం, మేక్‌ మై ట్రిప్‌ సేవలు దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా హోటళ్లు, విల్లాలు, హోమ్‌స్టేలలో అందుబాటులోకి రాగా, అంతర్జాతీయంగా 20 ప్రముఖ టూరిస్ట్ డెస్టినేషన్లలో వెయ్యికి పైగా ప్రాపర్టీలకు విస్తరించాయి. కంపెనీ వర్గాల ప్రకారం.. దేశీయ పర్యాటకుల్లో 53 శాతం మంది కస్టమర్లు ఉదయం 9 గంటల కంటే ముందే హోటళ్లకు చేరుకుంటున్నారు. వీరు 12 గంటల వరకు వెయిట్‌ చేయల్సి వస్తోంది. లేదా ఒక రోజుకు అదనంగా హోటల్‌ను బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దాదాపు 54 శాతం మంది మధ్యాహ్నం 3 గంటల తర్వాతే తిరుగు ప్రయాణం అవుతున్నారు. దీంతో, ఈ సమస్యకు చెక్‌ పెట్టేలా మేక్‌ మై ట్రిప్‌ తాజా నిర్ణయం తీసుకుంది. సాధారణ హోటల్ రూల్స్ (మధ్యాహ్నం 12 గంటల చెక్-ఇన్, చెక్-అవుట్) కారణంగా మెజారిటీ కస్టమర్లు ఇబ్బంది పడుతున్నట్లు కంపెనీ గుర్తించడంతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News